హైకోర్టు ఆదేశాలతో పోసానిపై కేసు... కారణం ఇదే!
అవును... జనసేన అధినేత పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ నేతలు రాజమండ్రి వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కేసులు, పిటిషన్లు, బెయిల్లూ, రిమాండ్ లతో సందడి సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై తాజాగా కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు నమోదైంది.
అవును... జనసేన అధినేత పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ నేతలు రాజమండ్రి వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదు. దీంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో జనసేన నేతల పిటిషన్ పై విచారించిన కోర్టు.. పోసానిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను అదేశించింది.
దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోసాని కృష్ణమురళిపై ఐపీసీ 354, 355, 500, 504, 506 సెక్షన్ల కింద రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా... జనసేన అధినేత పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై గతంలో రాజమండ్రికి చెందిన జనసేన నేతలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీని ఎందుకు పెట్టారు? చంద్రబాబుకు ఊడిగం చేయడానికా? మళ్లీ టీడీపీ పల్లకీ జనసేన కేడర్ తో మోయించడానికా? అని తీవ్ర స్థాయిలో విమర్శించారంటూ జనసేన నేతలు పేర్కొన్నారు.
అయితే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసేందుకు పోలీసులు అంగీకరించకపోవడంతో.. జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో తాజాగా పోసానిపై కేసు నమోదు చేశారు.