ఎగ్జిట్ విఫలం: లైవ్‌లో ఏడ్చేసిన యాక్సిస్ మై ఇండియా ఎండీ
ఇవన్నీ కూడా.. కేంద్రంలో బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టాయి. ముఖ్యంగా మోడీ హవాకు పట్టం కట్టాయి.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది..? ఏ పార్టికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై అనేక సర్వే సంస్థలు.. గత శనివారం ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. దాదాపు దేశవ్యాప్తంగా 220 సంస్థలు సర్వేలు నిర్వహించి.. పోలింగ్ అనంతరం నిర్వహించిన ఫలితాలను మొత్తం 7 దశల పోలింగ్ అనంతరం శనివారం వెల్లడించాయి. వీటిలోకొన్ని అత్యంత విశ్వసనీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా.. కేంద్రంలో బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టాయి. ముఖ్యంగా మోడీ హవాకు పట్టం కట్టాయి.
ప్రజాతీర్పు కూడా అలానే ఉందని చెప్పాయి. వీటిలో `యాక్సిస్ మై ఇండియా` సంస్థస ర్వేకు మంచి పేరుంది. గతంలో అనేక సందర్భాల్లో ఈ సంస్థ సర్వేలు నిజమయ్యాయి. అలానే ఈ సారి కూడా.. ఈసంస్థ.. సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. కేంద్రంలో మరోసారి మోడీ నేతృత్వంలోని ఎన్డీయే నే అధికారంలోకి వస్తుందని తెలిపింది. అంతేకాదు.. 543 పార్లమెంటు స్థానాల్లో ఎన్డీయే కూటమికి 361 నుంచి 401 సీట్లు దక్కుతాయని కూడా పేర్కొంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ ప్రదీప్ గుప్తా బల్ల గుద్ది మరీ చెప్పారు. అయితే.. ఇతర సంస్థలు మాత్రం ఎన్డీఏకి 320-350 మధ్య ఇచ్చాయి.
ఇక, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఈ ఎన్నికల్లో కేవలం 131-166 సీట్లు వస్తాయని యాక్సిస్ సంస్థ వెల్లడించింది. ఇతర పార్టీలకు 8 నుంచి 20 సీట్లు మాత్రమే దక్కుతాయని తెలిపింది. కానీ, ఈ సర్వే ఫలితాలు ఫలప్రదం కాలేదు. ఎన్డీయే కూటమి 250-270 మధ్య ఊగిసలాడుతోంది. కనీసం 300మార్కు దాటే పరిస్థితి కూడా లేదు. దీంతో ప్రదీప్ గుప్తా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ముందుకు వచ్చి భోరున విలపించారు. ఇక, ఏపీలోనూ ఆరా మస్తాన్ సర్వే.. దారుణంగా విఫలమైంది. ఇక్కడ వైసీపీకి 94-104 సీట్లు వస్తాయని లెక్క చెప్పారు.కానీ, ఇది సక్సెస్ కాకపోగా.. కనీసం 15 సీట్లు కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆరా మస్తాన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.