పార్టీకి "హెలీకాప్టర్" ఇవ్వాలంటూ హైకోర్టుకి కేఏ పాల్!
గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రలా రాజకీయాల్లోనూ కేఏ పాల్ సందడి మామూలుగా ఉండటం లేదనే చెప్పాలి
గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రలా రాజకీయాల్లోనూ కేఏ పాల్ సందడి మామూలుగా ఉండటం లేదనే చెప్పాలి. ప్రధానంగా ఏపీ విషయానికొస్తే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ లపై కేఏ పాల్ చేసే విమర్శలు పీక్స్ కి వెళ్తుంటాయి. ఇందులోనూ... "తమ్ముడూ" అంటూ పవ్న పై పాల్ విమర్శలు మరింత చర్చనీయాంశం అవుతుంటాయి. ఇక తెలంగాణలో అటు బీఆరెస్స్, ఇటు కాంగ్రెస్ లపైనా ఫైరవుతుంటారు.
ఈ క్రమంలో తన ప్రజాశాంతి పార్టీ గుర్తు విషయంలో కేఏ పాల్ హైకోర్టుని ఆశ్రయించారు. అవును... ప్రజాశాంతి పార్టీకి కామన్ సింబల్ గా హెలీకాప్టర్ గుర్తు ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్ పాల్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై ఈ ఏడాది జనవరి 19న ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కు వినతిపత్రం సమర్పించినట్లు తాజా పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇందులో భాగంగా... తనకు కామన్ సింబల్ గా హెలీకాప్టర్ ని ఇచ్చేలా ఎన్నికల కమిషన్ ని ఆదేశించాలని కోరారు కేఏ పాల్. దీంతో... ఈ పిటిషన్ పై వాదోపవాదాలు విన్న ధర్మాసనం, ఈసీ కౌంటర్ పరిశీలన అనంతరం తగిన ఉత్తర్వ్యులు ఇస్తామని పేర్కొంటూ ఈ నెల 27కి విచారణను వాయిదా వేసింది.
మరోపక్క తెలంగాణ లోక్ సభ ఎన్నికలల్లో ప్రజాశాంతి పార్టీ తరుపున ఎంపీ అభ్యర్థిగా సినీనటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ పోటీ చేస్తున్న నేపథ్యంలో... ఆయన విజయానికి అంతా సహకరించాలని కేఏ పాల్ కోరారు. ఇదే సమయంలో... తెలంగాణ మాజీ సీఎం కుమార్తె, బీఆరెస్స్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతారనే విషయం తాను ముందే చెప్పినట్లు పాల్ తెలిపారు.
ఈ మేరకు శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడిన పాల్... తెలంగాణ ముఖ్యమంత్రిపైనా సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి తనను ఎన్నోసార్లు కలిశారని చెప్పిన ఆయన... తెలంగాణ ప్రజలకు నీటి సమస్య తీవ్రంగా ఉందని.. రేవంత్ తన కేబినెట్ లోని నీటిపారుదల శాఖా మంత్రిని మార్చాలని తాను ఎప్పుడో చెప్పినట్లు తెలిపారు. ఇదే సమయంలో... వెయ్యి కోట్లకు రేవంత్ అమ్ముడుపోయాడని పాల్ సంచలన ఆరోపణలు చేశారు.