చంద్రబాబుతో ప్రయాణం... ప్రశాంత్ కిశోర్ తాజా క్లారిటీ ఇదే!
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. పైగా ఇంతకాలం ద్విముఖ పోరే అనుకున్న చోట షర్మిల ఎంట్రీతో త్రిముఖ పోరుకు తెరలేచిందని అంటున్నారు.
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. పైగా ఇంతకాలం ద్విముఖ పోరే అనుకున్న చోట షర్మిల ఎంట్రీతో త్రిముఖ పోరుకు తెరలేచిందని అంటున్నారు. ప్రధాన పార్టీలో టిక్కెట్లు దక్కని అసంతృప్తులకు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ షెల్టర్ కాబోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపికలో జగన్ నిమగ్నమై ఉన్నారు. వీలైనంత త్వరగా 175 + 25 అభ్యర్థులను ఫైనల్ చేసి జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తుంది.
మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు... ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవని పక్షంలో నిలవడం ఎంత కష్టమనేది చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నా అతిశయోక్తి కాదు. ఈ సమయంలోనే ఒంటరిపోరాట ఫలితాలు 2019లో రుచి చూసిన బాబు.. మరోసారి ఆ రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. ఇందులో భాగంగానే పవన్ తో జతకట్టారు.
ఆ సంగతి అలా ఉంటే... పవన్ తో జతకట్టినా.. బీజేపీతో జతకట్టాలని భావిస్తున్నా.. వారితో కుదరకపోతే వామపక్షాలతో జతకట్టినా.. పార్టీలో ఇంకా ఎదో వెళితి ఉందని, గెలుపుపై ధీమా రావడం లేదని బాబు అంతర్మదనం చేందుతున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తుంది! ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి ప్రయాణించాలని బాబు బలంగా ఫిక్సయ్యారని తెలుస్తుంది!
ఇందులో భాగంగానే గత నెలలో ఆయనను విజయవాడకు పిలిపించుకున్న చంద్రబాబు... సుదీర్ఘంగా చర్చించారు. అయినప్పటికీ ఆ భేటీ తదుపరి అప్ డేట్ ఏపీ రాలేదు. దీంతో... పీకే, టీడీపీకి వర్క్ చేయడం లేదనే చర్చ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయడానికి ప్రశాంత్ కిశోర్ అంగీకరించలేదని కథనాలొచ్చాయి. ఈ సమయంలో బాబుతో భేటీపై పీకే స్పందించారు.
అవును... టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వివరణ ఇచ్చారు. బిహార్ లో చేపట్టిన "జన్ సురాజ్" పాదయాత్ర సందర్భంగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పీకే... చంద్రబాబుతో భేటీ అయిన విషయం, అందుకు గల కారణాలను వెల్లడించారు. ఇందులో భాగంగా... ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రబాబును కలవాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ సందర్భంగా... చంద్రబాబుకు, తనకు ఉన్న ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రబాబును కలవాల్సి వచ్చిందని.. ఆ కామన్ ఫ్రెండ్ ఒక పొలిటికల్ బిగ్ షాట్ అని పీకే వ్యాఖ్యానించారు. ఆ సమయంలో... చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కలుసుకోవాల్సిందే అంటూ ఆ కామన్ ఫ్రెండ్ తనపై ఒత్తిడి తేవడంతో.. తప్పక విజయవాడకు వెళ్లి, బాబుతో భేటీ అయినట్లు తెలిపారు.
దీనిపై మరింత వివరణ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్... 2019 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని.. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించిందని.. అందుకే ఈ సారి టీడీపీ కోసం పని చేయాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఈ సందర్భంగా... రాజకీయ వ్యూహకర్తగా ఇప్పుడు పని చేయట్లేదనే విషయాన్ని చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో... ప్రస్తుతం తాను బిహార్ రాజకీయాల మీదే పూర్తి దృష్టి పెట్టానని, ఏపీలో ఏ పార్టీ తరఫునా తాను పని చేయట్లేదని పీకే మరింత క్లారిటీ ఇచ్చారు! దీంతో... టీడీపీ కోసం పీకే అనే చర్చకు తెరపడినట్లయ్యింది!! కాగా... ఇన్ని చెప్పిన పీకే... ఆ కామన్ ఫ్రెండ్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు!