ఓర్నీ.. కాన్పు మధ్యలో చేతులు ఎత్తేసిన డాక్టర్
తెలంగాణలో చోటు చేసుకున్న ఒక ఘోరం వెలుగు చూసింది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ వ్యవహారం విన్నంతనే వీడేం వైద్యుడు? అన్న భావన మనసుకు కలకగకుండా మానదు
తెలంగాణలో చోటు చేసుకున్న ఒక ఘోరం వెలుగు చూసింది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ వ్యవహారం విన్నంతనే వీడేం వైద్యుడు? అన్న భావన మనసుకు కలకగకుండా మానదు. ప్రసవ వేదనతో ఆసుపత్రికి వచ్చిన మహిళకు కాన్పు చేయకుండా.. మధ్యలో చేతులు ఎత్తేయటమే కాదు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరిన వైనం షాకింగ్ గా మారింది. ఖమ్మం జిల్లా తల్లాడలో చోటు చేసుకున్న ఈ ఘటనలోకి వెళితే..
లావణ్య అనే గర్భవతికి నెలలు నిండటంతో తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. పీహెచ్ డీ వైద్యుడు రత్న మనోహర్ సెలవులో ఉండటంతో ఇన్ ఛార్జి బాధ్యతలు తీసుకున్నారు అన్నారుగూడెంపల్లె ఆసుపత్రి వైద్యుడు గోపీ. నొప్పులు రావటంతో శుక్రవారం రాత్రి సిబ్బందితో కలిసి ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు.
గర్భం నుంచి ఆడ శిశువు కొంతమేర బయటకు వచ్చింది. మిగిలిన భాగం బయటకు రాకపోవటంతో లావణ్య పల్స్ రేట్ పడిపోవటంతో.. కాన్పును మధ్యలో ఆపేసిన వైద్యుడు లావణ్యను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో లావణ్యను ఎలా తీసుకెళతామని ఆమె భర్త.. బంధువులు వైద్యుడితో వాగ్వాదానికి దిగారు.
దీంతో.. మరోసారి ప్రయత్నించిన వైద్యుడు శిశువును బయటకు తీశారు.అయితే.. అప్పటికే ఉమ్మునీరు తాగిన శిశువు మరణించింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలింతను ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్.. స్టాఫ్ నర్సు నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించినట్లుగా ఆరోపిస్తున్నారు. మొదటి కాన్పు ప్రైవేటు ఆసుపత్రిలో చేయించామని.. ఆరోగ్య.. ఆశ కార్యకర్తల ఒత్తిడితో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన దానికి బిడ్డను కోల్పోయినట్లుగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.