ప్రతిష్టాత్మకమైన సీటు : ప్రియాంకా గాంధీ షాకింగ్ డెసిషన్ ?
కానీ ప్రియాంకా గాంధీ మాత్రం ఏకంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో నవతరం నాయకురాలు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, అగ్రనేత రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ రానున్న లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె 2024 ఎన్నికల్లో తల్లి ఖాళీ చేసిన రాయబరేలీ నుంచి పోటీ చేసి గెలిచి లోక్ సభలో కనిపిస్తారు అని అంతా అనుకున్నారు.
కానీ ప్రియాంకా గాంధీ మాత్రం ఏకంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. అమె ఉత్తరప్రదేశ్‌లో ఒక సీటులో బరిలో నిలవడం కంటే పార్టీ కోసం ప్రచారం చేయడం ద్వారానే పార్టీకి ఎక్కువ లాభం చేకూరుతుందని భావిస్తున్నారని అంటునారు. అందుకే ఆమె పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది.
గతసారి కంటే ఈసారి ఉత్తరాదిన మారుతున్న రాజకీయ సన్నివేశం ఇండియా కూటమికి పెరుగుతున్న అవకాశాలు అన్నీ దృష్టిలో పెట్టుకున్న ప్రియాంకా గాంధీ తాను పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికే సిద్ధం అవుతున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రియాంక ప్రస్తుతం ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఆమె వరసబెట్టి మే నెల మొదటి వారం తనా జోరుగా ప్రచారం చేస్తారు. మే 1న అస్సాం, మే 2న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో ప్రచారం చేస్తారు. ఆపై మే 3న ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో పర్యటిస్తారు. మొత్త ఏడు దశలలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో రెండు దశలు పూర్తి అయ్యాయి. ఇక మిగిలిన అయిదు దశలలో కూడా ప్రచారం చేపట్టడం ద్వారా ఆమె కాంగ్రెస్ కి ఇండియా కూటమికి గెలుపు అవకాశాలు పెంచాలని చూస్తున్నారు.
అయితే యూపీ కాంగ్రెస్ వింగ్ మాత్రం కేంద్ర కాంగ్రస్ నాయకత్వానికి ఒక విన్నపం చేస్తోంది. అమేథీ, రాయబరేలీ నుంచి రాహుల్, ప్రియాంకలను బరిలోకి దింపాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రస్ పార్టీ అధిష్ఠానాన్ని కోరింది. అయితే, దీనిపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే అమేథీ నుంచి రాహుల్ బరిలోకి దిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రియాంక్గా కనుక పోటీ చేయకపోతే రాయబరేలీలో ఆ పార్టీ తరఫున ఎవరు పోటీలో ఉంటారు అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. వరసగా రెండు దశాబ్దాల పాటు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన సీటు ఇది. అంతే కాదు నెహ్రూ ఫ్యామిలీలో ఇందిరాగాంధీ కూడా ఇక్కడ నుంచి గెలిచారు. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సీటు నుంచి పోటీ చేయడం ద్వారా ప్రియాంక ఎన్నికల రాజకీయాల్లో ప్రవేశించాలని కాంగ్రెస్ వాదులు అయితే కోరుకుంటున్నారు.