ప్రియాంకా గాంధీకి టీడీపీ జెండాల స్వాగతం

కాంగ్రెస్ అగ్ర నేత, గాంధీల వారసురాలు ప్రియాంకా గాంధీ రోడ్ షోలో టీడీపీ హడావుడి మామూలుగా లేదు. ఖమ్మం జిల్లాలో ప్రియాంకా గాంధీ రోడ్ షో చేశారు.

Update: 2023-11-25 11:37 GMT

కాంగ్రెస్ అగ్ర నేత, గాంధీల వారసురాలు ప్రియాంకా గాంధీ రోడ్ షోలో టీడీపీ హడావుడి మామూలుగా లేదు. ఖమ్మం జిల్లాలో ప్రియాంకా గాంధీ రోడ్ షో చేశారు. ఈ సందర్భంగా ఆమెకు టీడీపీ జెండాలు స్వాగతం పలికారు. ఇది నిజంగా రాజకీయ చిత్రంగా చూదాలనే అంటున్నారు

ఎటు చూసినా కాంగ్రెస్ టీడీపీ జెండాలు కలసిపోయి సందడి చేశాయి. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్టీయార్ ఆనాడు పార్టీ పెట్టి ప్రియాంకా గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీకు ఎదురు నిలిచారు. అయితే అదే కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నిండు అసెంబ్లీలో ఉమ్మడి ఏపీలో తన రక్తంలో కాంగ్రెస్ ముప్పయి శాతం ఉందని బాహాటంగా చెప్పుకున్నారు.

అది జరిగిన చాన్నాళ్ళకి 2018లో ఏకంగా టీడీపీ పుట్టికతోనే ద్వేషించిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఇదే తెలంగాణా ఎన్నికల్లో పోటీకి నిలిచారు. అయితే జనాలు ఈ రెండు పార్టీల పొత్తుని మాత్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఆ తరువాత ఏపీలో కూడా కాంగ్రెస్ ని బాబు దూరం పెట్టారు.

రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసినపుడు కూడా చంద్రబాబు ఏమీ మాట్లాడలేదు ఈ నేపధ్యంలో తెలంగాణా ఎన్నికలు మళ్లీ వచ్చాయి. టీడీపీ పోటీ చేస్తుంది అని అంతా అనుకుంటే పోటీ నుంచి విరమించుకుని ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించింది అని ప్రచారం అయ్యే ఉంది. ఇపుడు అది కాస్తా ఏకంగా డైరెక్ట్ గానే కాంగ్రెస్ కి మద్దతుగా మారింది

ముఖ్యంగా ఖమ్మంలో అయితే టీడీపీ జెండాలు కాంగ్రెస్ జెండాలు కలసిపోయాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభలలో తమ్ముళ్లు ఓపెన్ గానే తిరుగుతూ కనిపిస్తున్నారు. ఇపుడు ప్రియాంకా గాంధీ రోడ్ షోలో సైతం పసుపు జెండాలు రెపరెపలాడడం చూస్తూంటే టీడీపీ మద్దతు బాహాటం అయిపోయింది అని అంటున్నారు.

మరో వైపు టీడీపీ మద్దతు కోసం బీయారెస్ నేతలు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించినట్లుగా ఉంది అని అంటున్నారు. దీనికి టీడీపీ అగ్ర నాయకత్వం నుంచి పరోక్షంగా డైరెక్షన్లు ఏమైనా వచ్చాయా అన్న చర్చ సాగుతోంది

ఇక టీడీపీ కాంగ్రెస్ జెండాలు రెండూ కలసిపోయిన వేళ ఇది కేవలం తెలంగాణాకే పరిమితం అవుతుందా లేక రేపు ఏపీలో కూడా విస్తరిస్తుందా జాతీయ రాజకీయాలలో కూడా ప్రభావితం చూపుతుందా అన్న ఆలోచనలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు ఇంకో వైపు చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేట సెగ్మెంట్లలో టీడీపీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. అలాగే టీడీపీ ఇప్పటికీ ఎంతో కొంత బలంగా ఉంది

ఇపుడు ఆ బలం అంతా కాంగ్రెస్ కి టర్న్ అయితే కచ్చితంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కి అది రాజకీయంగా లాభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈక్ టీడీపీ కేడర్ ని భారీగా ఉన్న టీడీపీ మద్దతుదారులను తమ వైపు తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా గమనిస్తోంది.

తెలంగాణా వచ్చాక ఎక్కువ శాతం టీడీపీ ఓట్లు బీయారెస్ కే మళ్ళాయి. కానీ ఇపుడు కాంగ్రెస్ ఆ ఓట్లు టర్న్ కావడం అన్నది తెలంగాణా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామంగా చూస్తున్నారు. బీయారెస్ ని ఎలాగైనా గద్దె దించాలన్నది టీడీపీ కార్యకర్తల పట్టుదలగా ఉంది అని అంటున్నారు.

అందుకే వారంతా ఇపుడు కాంగ్రెస్ గెలుపు కోసం ఓపెన్ గానే కృషి చేస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ చాన్నాళ్ళు తెలంగాణాను ఏలింది. కాంగ్రెస్ కూడా పాలించింది. బీయారెస్ రెండు సార్లు పాలించింది. ఇపుడు కాంగ్రెస్ టీడీపీ కలసి బీయారెస్ అనే ఉమ్మడి శత్రువుని ఎదుర్కొనే క్రమంలో జరిగే పరిణామాలు సంచనలంగా మారుతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News