ఆమెతో నిర్మాత.. అసలు నిజం తెలియడంతో..

అయితే టాలీవుడ్ కు చెందిన నిర్మాత ఒకరు.. ఓ వివాదంలో చిక్కుకున్నారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి.

Update: 2024-10-05 15:30 GMT

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఎక్కువగా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో ఊహాగానాలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిలో చాలా వరకు నిజమవ్వగా.. మరికొన్ని అబద్ధాలుగానే నిలిచిపోతాయి. ప్రేమలో మునిగితేలుతూ ఉన్నారని కొందరు పేర్లు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. అందులో చాలా తక్కువ శాతం వరకే నిజం ఉంటుంది. అదే సమయంలో వివాహేతర సంబంధాల ఆరోపణలు కూడా వింటుంటాం.

అయితే టాలీవుడ్ కు చెందిన నిర్మాత ఒకరు.. ఓ వివాదంలో చిక్కుకున్నారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు రాగా.. డీఎన్ఏ టెస్ట్ వరకు వ్యవహారం వెళ్లినట్లు టాక్ వినిపించింది. ఇప్పుడు అంతా సద్దుమణిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో ప్రొడ్యూసర్ కూడా అలాంటి పరిస్థితిలోనే చిక్కుకున్నారని సమాచారం. కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఆ విషయం తెగ వైరల్ అవుతోంది.

మంచి బిజినెస్ మ్యాన్ ఆయన.. సినీ నిర్మాణంపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఒక సినిమా చేయగా... ప్రస్తుతం మరో మూవీ ప్రొడక్షన్ తో బిజీగా ఉన్నారు. అదే సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల పాటు ఇద్దరూ బాగానే మూవ్ అయ్యారని సమాచారం. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో ఆమెకు మరికొందరితో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు నిర్మాతకు తెలిసిందట. దీంతో తాను ఉచ్చులో పడ్డారని ఆయన గుర్తించారని టాక్. వెంటనే ఆ ఉచ్చు నుంచి బయటపడేందుకు మార్గం ఆలోచించారని తెలుస్తోంది. సమస్యను పరిష్కరించేందుకు ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఆమె కూడా నిర్మాత తో సెటిల్ మెంట్ పై దృష్టి సారించారని టాక్ వినిపిస్తోంది.

దీంతో మొత్తం విషయం బయటపడకుండా సద్దమణిగినట్లు ఇప్పుడు జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి నిర్మాత.. ఉచ్చులో చిక్కుకున్నప్పటికీ చాకచక్యంగా బయటపడ్డారని ప్రచారం సాగుతోంది. మరి ఆ నిర్మాత ఎవరో.. వస్తున్నా వార్తల్లో నిజమో కాదో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News