బాబును పురందేశ్వరి.. బీజేపీని చంద్రన్న.. ఇదో రాజకీయం ..!
కట్ చేస్తే.. ఇటీవల తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబు పేరు చెప్పకుండానే విమర్శలు చేసింది.
ఏపీ రాజకీయాలు నిన్న మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్టుగా మారిపోయాయి. ఒక ప్పుడు బీజేపీకి-టీడీపీకి పడదు. కానీ, ఇప్పుడు ఇరు పార్టీలూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటు న్నాయి. అంతేకాదు.. ఒకరినొకరు రక్షించుకుంటున్నాయి కూడా. ఒకప్పుడు ఉప్పు - నిప్పుగా ఉన్న బీజేపీ చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు తర్వాత.. కూడా పాలు నీళ్ల మాదిరిగా కలిసిపోయారు. ఒకరినొకరు కాపాడుకుంటున్నారు కూడా.
కొన్నాళ్ల కిందట వైసీపీ నాయకులు బీజేపీ చీఫ్ పురందేశ్వరిని విమర్శించారు. దీనికి ప్రతిగా చంద్రబాబు వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ''ఆమె ఒక మహిళ, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కడాన ఆమెను కూడా వదలడం లేదు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర బాధ్యతలు తీసుకున్నారు'' అని పురందేశ్వరిని నాడు చంద్రబాబు వెనుకేసుకు వచ్చారు. కట్ చేస్తే.. ఇటీవల తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబు పేరు చెప్పకుండానే విమర్శలు చేసింది.
రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తి అత్యంత కీలకమైన ఒక ఆలయానికి సంబంధించిన వ్యవహారాలను మీడియా ముందు ఎలా మాట్లాడతారని కూడా ప్రశ్నించింది. అయితే.. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నోరు విప్ప లేదు. కానీ, పురందేశ్వరి మాత్రం చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నముఖ్య మంత్రికి ఏ విషయంపైనైనా మాట్లాడే హక్కు ఉంటుందని ఆమె తేల్చి చెప్పారు. ఈ వ్యవహారం వివాద మవుతుందని తెలిసి కూడా చంద్రబాబును ఆమె సపోర్టు చేస్తూ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇక, కధ ఇక్కడితో అయిపోలేదు. తాజా సీఎం చంద్రబాబు ఏకంగా బీజేపీ పార్టీనే భుజాన వేసేసుకున్నా రు. వైసీపీ అధినేత జగన్.. హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి కీలక కామెంట్లు చేశారు. అక్కడ కూడా ప్రజలకు అనుమానాలు ఉన్నాయని.. అంటూ.. ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేశారు. వాస్తవానికి హరియాణాలో గెలిచింది బీజేపీ. కాబట్టి.. జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు రియాక్ట్ కావాలి. కానీ, దీనికి భిన్నంగా ముందు ముందే.. చంద్రబాబు స్పందించారు.
2019లో జరిగిన ఎన్నికల్లో మీ రు గెలిచారు కదా.. అప్పుడు కూడా ఈ వీఎంలను మేనేజ్ చేసినట్టేనా? అని నిలదీశారు. అంటే.. బీజేపీ తరఫున చంద్రబాబే వైసీపీని కడిగిపారేశారు. ఈ పరిణామాలు చూస్తే.. బాబును పురందేశ్వరి.. బీజేపీని చంద్రన్న.. మోసేస్తున్నారని.. ఇదో రాజకీయమని అంటున్నారు పరిశీలకులు.