తమ్ముళ్లు గెలిస్తే స్పీకర్ ఆయనేనట.. తెర పైకి కొత్త లెక్కలు

ఎన్నికల వేళ.. ఒక్కో సారి ఒక్కో అంశానికి ప్రాధాన్యత వచ్చేస్తుంటుంది. నోటిఫికేషన్ విడుదలైనంతనే.. సీట్ల పంచాయితీ మొదలవుతుంది

Update: 2024-05-19 16:30 GMT

ఎన్నికల వేళ.. ఒక్కో సారి ఒక్కో అంశానికి ప్రాధాన్యత వచ్చేస్తుంటుంది. నోటిఫికేషన్ విడుదలైనంతనే.. సీట్ల పంచాయితీ మొదలవుతుంది. ఎవరికి టికెట్లు దక్కుతాయి? ఎవరికి దెబ్బ పడుతుందన్న ఆసక్తికర చర్చ జోరుగా సాగుతుంది. ఒకసారి సీట్ల పంచాయితీ తీరిన తర్వాత తెర మీదకు వచ్చే అంశం.. ఎన్నికల్లో గెలుపు. దీనిపై భారీగా ప్రచారం.. పోల్ మేనేజ్ మెంట్లతో కిందా మీదా పడే పరిస్థితి. పోలింగ్ వేళకు.. తాము వేసుకున్న ప్లాన్ కు తగ్గట్లే.. అన్ని జరుగుతున్నాయా? లేదా? అన్నదే పెద్ద అంశంగా మారుతుంది.

పోలింగ్ పూర్తి అయ్యాక.. గెలుపు లెక్కలే ప్రధానంగా మారతాయి. అదే సమయంలో.. గెలిచిన తర్వాత తమకు దక్కే పదవుల మీద ఫోకస్ పెరుగుతుంది. ఇప్పుడు ఏపీలోని కొందరు నేతలు ఇదే తీరును ప్రదర్శిస్తున్నారు. అధికార వైసీపీకి సంబంధించి ఎవరు ఎలాంటి పదవుల్ని ఆశించటం లేదు. ఎందుకంటే.. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటే వేదంగా భావించటం.. ఆయన తీసుకున్న నిర్ణయాలను ఫాలో కావటంపై వారికి వేరే మాట లేదు.

అందుకు భిన్నంగా తెలుగుదేశంలో మాత్రం పదవుల మీద చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తామన్న ధీమాను వైసీపీ మాదిరి చెప్పలేకున్నా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏయే పదవులు అన్న అంశం మీద మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది. టీడీపీ కూటమి చేతికి పవర్ వస్తే.. కీలకమైన స్పీకర్ పదవి ఎవరికి దక్కతుందన్నది ఇప్పుడు చర్చగా మారింది. దీనిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా చివరి నిమిషంలో టీడీపీ తరఫున ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన రఘురామ క్రిష్ణ రాజు హాట్ టాపిక్ గా మారారు. ఆయన గెలుపు మీద సందిగ్ఘం ఉన్నప్పటికీ.. ఆయన గెలిస్తే మాత్రం ఏపీకి కాబోయే స్పీకర్ ఆయనే అంటున్నారు. స్పీకర్ సంగతి తర్వాత.. మొదట గెలుస్తారా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు మాత్రమే కాదు.. పోలింగ్ అయ్యాక కూడా ఏదో రూపంలో రఘురామ వార్తల్లో ఉండటం గమనార్హం.

Tags:    

Similar News