పొత్తులు ఉంటాయంటూ రాజ్ నాధ్ సంకేతాలు...!

ఇక రాజ్ నాధ్ సింగ్ బీజేపీలో కీలకంగా ఉన్న రోజులలో ప్రెసిడెంట్ గా ఉన్నపుడే పొత్తులు టీడీపీతో కుదిరిన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేస్తున్నారు.

Update: 2024-02-27 18:07 GMT

ఏపీలో పొత్తులు ఉంటాయని ఏపీకి వచ్చి వరసగా మూడు సభలలో పాల్గొన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ సంకేతాలు ఇచ్చారు. మంగళవారం రాజ్ నాధ్ సింగ్ ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ వచ్చారు. అక్కడ మేధావుల సదస్సులో పాలు పంచుకున్నారు. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ పార్టీ సభలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఏలూరు వెళ్లారు. అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశాలలో పలువురు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు రాజ్ నాధ్ తో ముఖాముఖీ మాట్లాడి తమ డౌట్లను తీర్చుకున్నారు. ఈ నేపధ్యంలో కొందరు నేతలు ఏపీలో బీజేపీ పొత్తుల గురించి రాజ్ నాధ్ వద్ద ప్రస్తావించారు.

దానికి బదులిస్తూ ఏపీలో పొత్తులు ఉంటాయని రాజ్ నాధ్ చెప్పడం విశేషం. అంతే కాదు అమరావతి ఏపీకి రాజధానిగా ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ మేరకు పార్టీ తీర్మానం చేసింది అని గుర్తు చేశారు. దాంతో బీజేపీ ఏపీ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చినట్లు అయింది.

ఏపీలో బీజేపీ పొత్తుల విషయం అయితే రాజ్ నాధ్ సింగ్ కంటే కూడా ఆ పార్టీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చూస్తున్నారు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం విషయం చెప్పుకోవాలంటే రాజ్ నాధ్ సింగ్ నితిన్ గడ్కరీ వంటి వారు చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉంటారు అని మొదటి నుంచి ఒక ప్రచారం ఉంది.

ఇక రాజ్ నాధ్ సింగ్ బీజేపీలో కీలకంగా ఉన్న రోజులలో ప్రెసిడెంట్ గా ఉన్నపుడే పొత్తులు టీడీపీతో కుదిరిన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేస్తున్నారు. దాని వల్లనే ఆయన పొత్తులు ఉంటాయని చెప్పారా అన్న చర్చ సాగుతోంది. అయితే బీజేపీలో ఎవరు ఏ విధంగా చెప్పినా తేల్చాల్సింది అమిత్ షా నరేంద్ర మోడీలు మాత్రమే అని అంటున్నారు.

ఈ ఇద్దరు నాయకులూ ఫైనలిజ్ చేస్తేనే పొత్తుల కధ ముందుకు సాగేది అని అంటున్నారు. ఈ క్రమంలో చూసుకుంటే బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వకపోతే మాత్రం పొత్తు ప్రసక్తి ఉండదని అంటున్నారు. బీజేపీకి కనీసంగా ఎనిమిది ఎంపీ సీట్లు పదిహేను నుంచి ఇరవై దాకా అసెంబ్లీ సీట్లు ఇచ్చి తీరాల్సిందే అని అంటున్నారు.

బీజేపీ ఏపీలో ఇప్పటికే తొమ్మిది ఎంపీ సీట్లలో అభ్యర్ధులను కూడా రెడీ చేసి పెట్టుకుందని ఆ సీట్లను పొత్తులో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఆయా సీట్లలో సగం సీట్లు టీడీపీ ఇవ్వడానికి ఇష్టపడనివే అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే రాజ్ నాధ్ సింగ్ పొత్తుల మీద గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే బీజేపీ పెద్దలు పొత్తులు వదులుకోరని తమ మాట నెగ్గించేందుకే చూస్తారు అని అంటున్నారు.

Tags:    

Similar News