ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కీలక నిర్ణయం!!
ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఉండి అసెంబ్లీ టిక్కెట్ రఘురామ కృష్ణంరాజుకు కేటాయించారనే విషయం రామరాజుకి తెలిసిందని.. అప్పటి నుంచీ ఆయన చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో టిక్కెట్ ప్రకటించిన తర్వాత ఇలా హ్యాండ్ ఇవ్వడం ఏమిటంటూ బాబుకు జైకొట్టిన కార్యకర్తలే ఇప్పుడు శాపనార్థాలు పెడుతున్నారని తెలుస్తుంది!
అవును... అభ్యర్థుల ఎంపికలో భాగంగా టీడీపీ ఉండి టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెలే రామరాజుకి ఇస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. దీంతో... మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన రెబల్ గా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది! ఈ సమయంలో రామరాజు కూడా ప్రచారంలో బిజీ అయిపోయారు! ఈ సమయంలో ఆయనకు కూడా టిక్కెట్ లేదని తెలిసిందని అంటున్నారు.
ఉండి టిక్కెట్ విషయంలో రఘురామ కృష్ణంరాజుకి చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది! దీంతో... ఇప్పటికే కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన రామరాజు... కార్యకర్తలు, కుటుంబ సభ్యుల సూచనల మేరకు తన నెక్స్ట్ స్టెప్ ఉంటుందని మంగళవారం జరిగిన ఆ సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో... రామరాజు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా రానున్న ఎన్నికల్లో ఉండి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారన్ని తెలుస్తోంది. టీడీపీ టిక్కెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను పోటీ చేయడం కన్ ఫాం అని ఇప్పటికే ఆయన కార్యకర్తలకు, అనుచరులకు హింట్ ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నారని స్పష్టం చేశారని తెలుస్తుంది!
దీంతో... ఉండి టీడీపీ మూడు ముక్కలైందనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి! ఇప్పటికే టీడీపీలో కొంత కేడర్ శివరామరాజు వైపు వెళ్లగా.. ఇప్పుడు కొంత వర్గం రామరాజు వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని. ఇంకా మిగిలిన కేడర్ ఎవరైనా ఉంటే... వారంతా రఘురామకృష్ణంరాజుకు టిక్కెట్ ఇచ్చిన అనంతరం ఆయన వెంట నడిచే అవకాశం ఉందని చెబుతున్నారు! దీంతో... టీడీపీ కంచుకోటలో ఇలాంటి పరిణామాలు నెలకొనడం ఆ పార్టీని కలవరపెడుతుందని చెబుతున్నారు!