జమ్మూలో ఉగ్రదాడి వివరాలివే... పాక్ పై కేంద్రమంత్రి నిప్పులు!

ఈ ఘటనలో మృతుల సంఖ్య 9 కాగా.. గాయపడినవారు 33 మంది ఉన్నారు.

Update: 2024-06-10 14:05 GMT

ఆదివారం ఓ పక్క భారత్ లో కేంద్ర ప్రభుత్వం కొలువుదీరుతున్న సందడి.. మరోపక్క అదే రోజు హిందూ యాత్రికులే లక్ష్యంగా జమ్మూలో ఉగ్రదాడి. ఇది చేసింది తామే అని పాకిస్థాన్ లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీ.ఆర్.ఎఫ్) ప్రకటించుకుంది. ఈ వ్యవహారంపై కేంద్రంలోని కొత్త మంత్రులు ఫైరవుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 9 కాగా.. గాయపడినవారు 33 మంది ఉన్నారు.

అవును... శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తోన్న బస్సుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈ సమయంలో డ్రైవర్ కు బుల్లెట్ తాకడంతో వాహనం ఆదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా.. 33 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు కండక్టర్ కూడా మరణించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు ప్రకటించుకోవదంతో ఎన్.ఐ.ఏ. రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో హంతకుల వేట కొసం ఆర్మీ, సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా డ్రోన్ ల సాయంతోనూ పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారని సమాచారం.

పాక్‌ కు బుద్ధి చెప్పాల్సిందే: కేంద్ర మంత్రి

ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామేనంటూ పాకిస్థాన్ లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకున్న నేపథ్యంలో... కేంద్రమంత్రి రామదాస్‌ అథవాలే తీవ్రంగా స్పందించారు. ఇందులో భాగంగా... మోడీ నేతృత్వంలో కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరిన సమయంలో ఉద్దేశపూర్వకంగా భయాన్ని సృష్టించేందుకు ఈ ఘటనకు పాల్పడ్డ్డారని ఫైర్ అయ్యారు. ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతుంటే... పాకిస్థాన్ కు మనం గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అని అన్నారు.

Tags:    

Similar News