ముందే నిర్మించుకున్న 'మహాప్రస్థానం'
తెలుగు పాత్రికేయ రంగానికి దశ-దిశ చూపించిన రామోజీరావు.. శనివారం తెల్లవారుజామును విశ్రమించా రు.
తెలుగు పాత్రికేయ రంగానికి దశ-దిశ చూపించిన రామోజీరావు.. శనివారం తెల్లవారుజామును విశ్రమించా రు. పోయినోళ్లందరూ మంచోళ్లు- అన్న మహాకవి ఆత్రేయ మాట నిజం చేస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన అనేక మంచి పనులు చేశారు. కరువు నేలల్లో కనక సిరులు పండించే వ్యూహాలను కూడా కొన్ని దశాబ్దాల కిందటే ఎరుక పరిచారు. కానీ, ఎవరూ వాటిని పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే.. నదుల అనుసంధానం జరిగి.. కరువు నేలలు కనక మేడలు కట్టుకునే పరిస్థితి ఉండేది.
ముందు చూపు.. అకుంఠిత కృషి.. సాధ్యం కానిదిలేదని నిరూపిస్తాయని చెప్పే రామోజీ జీవితంలో అనేక విజయాలు ఉన్నాయి. తన మరణాన్ని కూడా.. ఆయన ముందుగానే నిర్దేశించుకున్నారు. 75 ఏళ్ల వయసు వచ్చాక.. ఆయన స్వయంగా రాసుకున్న జీవిత సంకలనం.. `75 ఏళ్ల వసంతం`లో అనేక విషయాలు చేర్చారు. తన జీవితంలో ఎదిగిన తీరు.. వేసిన అడుగుల తీరును వివరించారు. సైకిల్ నుంచి మోటారు సైకిలు వరకు.. అక్కడ నుంచి అంచెలంచెలుగా ముందుకు సాగిన తీరును కళ్లకు కట్టారు.
2012-13 మధ్య కాలంలో చిన్నకుమారుడు చనిపోయినప్పుడు చాలా దిగాలు పడిపోయినా... ఆయన త్వరగానే తేరుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ తాజాగా నిర్మాణంలో ఉన్న `ఓం` నగరం.. త్వరలోనే ప్రారంభం కావల్సి ఉంది. అయితే.. ఇంతలోనే ఆయన శాశ్వత విశ్రాంతి లోకి జారుకున్నారు. అయితే.. ముందుగానే తనకు తానే.. మహాప్రస్థానం నిర్మించుకున్నారు రామోజీ, ఫిల్మ్‌సిటీ శివారులోని అర ఎకరం స్థలంలో సర్వాంగ సుందరంగా రామోజీ.. తన మహాప్రస్థాన వేదికన తానే నిర్మించుకోవడం గమనార్హం.