రేవంత్ పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు... తెరపైకి రంగనాథ్ కామెంట్లు!

ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

Update: 2024-09-08 10:31 GMT

గత రెండు మూడు వారాలుగా తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో... రాజకీయంగానూ ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ సందర్భంగా... రేవంత్ హీరో అవ్వాలంటే అంటూ ఓ కీలక వ్యాఖ్య చేశారు.

అవును... హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై హైడ్రా విరుచుకుపడుతున్న విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కమర్షియల్ భవనాలు, గృహ సముదాయాలు, విద్యా సంస్థలకు చెందిన భవనాల విషయంలో హైడ్రా విభిన్నంగా ముందుకు వెళ్తుందని అంటున్నారు. ఈ సమయంలో రాజా సింగ్ స్పందించారు.

ఇందులో భాగంగా... హైడ్రా అధికారులు ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ ని ఎప్పుడు కూల్చేస్తున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు. ఆ కాలేజీని ఏరోజు కూలుస్తారో సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ లు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో.. ఒవైసీ కాలేజీలను కూల్చని పక్షంలో హైడ్రా విఫలమైనట్లేనని ఆయన విమర్శించారు.

ఇదే సమయంలో... ఒవైసీకి చెందిన కాలేజీలను కూలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హీరో అవుతారని ఆయన తెలిపారు.

కాగా... కమర్షియల్ నిర్మాణాల విషయంలో హైడ్రా స్పాట్ డెసిషన్ తీసుకుంటుందని.. నివాస సముదాయాల విషయంలో ముందస్తు నోటీసులు ఇస్తుందని అంటున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో విద్యాసంస్థలకు సంబంధించిన నిర్మాణాల విషయంలో కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా... విద్యార్థుల అకడమిక్ ఇయర్ ని దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలపై వస్తోన్న అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా నిర్ణయాలు ఉంటున్నాయని.. ప్రధానంగా హైడ్రా కూల్చివేతల వల్ల విద్యార్థుల అకడమిక్ ఇయర్ ఇబ్బందుల్లో పడకుండా, వారి చదువులను డిస్ట్రబ్ చేయకుండా ఉండాలని తాము ఆలోచిస్తున్నట్లు ఇప్పటికే రంగనాథ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News