రష్మిక ఫేక్ వీడియో.. అతను దొరికాడు కానీ..
హీరోయిన్ రష్మిక మందన్న ఫేస్ తో ఇటీవల ఒక ఫేక్ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
హీరోయిన్ రష్మిక మందన్న ఫేస్ తో ఇటీవల ఒక ఫేక్ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లిఫ్ట్ లో పొట్టి దుస్తులలో కనిపించిన ఒక అమ్మాయి మొహానికి ఆ టెక్నాలజీతో రష్మిక మొహాన్ని జోడించి ఇంటర్నెట్ లో వదిలారు. ఇక ఆ వీడియో నిజమే అనుకొని చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. అయితే అది నిజమైన రష్మిక వీడియో కాదు అని అనంతరం క్లారిటీ కూడా తొందరగానే వచ్చింది.
చాలామంది సినీ ప్రముఖులు ఆ వీడియో పై స్పందించడంతో విషయం సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్లింది. అమితాబ్ బచ్చన్ తో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా అలాంటి వీడియో క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలి అని కోరారు. స్కా ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఆ వీడియోకు సంబంధించిన మూలాలు వెతికే పనిలో పడ్డారు.
అయితే రష్మిక మందన్న ఫేస్ తో వచ్చిన ఆ ఫేక్ వీడియో ను మొదట వైరల్ చేసిన వ్యక్తి కూడా దొరికాడు. బీహార్ కు చెందిన యువకుడు ఆ వీడియో సోషల్ మీడియాలో మొదట పోస్ట్ చేసినట్లుగా విషయం బయటకు వచ్చింది. అయితే నిజానికి అతను ఆ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయలేదు అని పోలీసులు కనుగొన్నారు.
అతను కూడా వేరే ఫ్లాట్ ఫామ్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అసలు ఎక్కడ నుంచి ఆ వీడియో పుట్టుకొచ్చింది అసలు మొదట దాన్ని క్రియేట్ చేసింది ఎవరు ఎలాంటి టెక్నాలజీని వాడారు అనే అంశాలపై పోలీసులు మరింతగా లోతుగా విచారణ జరుపుకున్నారు. ఇక ఈ వీడియోను మొదట షేర్ చేసిన యువకుడి వయసు కేవలం 19 మాత్రమే.
అతను వేరే సోషల్ మీడియా ప్లాట్ఫారం నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ ఘటన విషయంలో పోలీసులు ఇంకా ఎవరిని అరెస్టు చేయలేదు. కేవలం లోతుగా విచారణ జరుపుకున్నారు. ఎలాగైనా అసలు నిందితులను పట్టుకోవాలి అని పోలీసులు టెక్నాలజీని గట్టిగా వాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రష్మిక సినిమాల విషయానికొస్తే ఆమె యానిమాల్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటించాడు. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.