"బాగున్నాను"... అని చెప్పిన రెండు రోజులకే రతన్ టాటాకు ఏమైంది?

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా (86) ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది.

Update: 2024-10-09 15:24 GMT

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా (86) ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులు వెల్లడించారంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన క్రిటికల్ కండిషన్ లో ఉన్నారని, ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అంటున్నారు.

అవును... రతన్ టాటా పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారని కథనాలొస్తున్నాయి. వాస్తవానికి రతన్ టాటా ఆరోగ్యం గురించి ఇప్పటికే పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం రతన్ టాటా స్వయంగా స్పందిస్తూ... తన వయసుకు సంబంధించిన కారణాల వల్ల రొటీన్ మెడికల్ చెకప్ లో భాగంగానే ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇదే సమయంలో దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని అటు ప్రజలకు, ఇటు మీడియాకు సూచించారు! అలా ఆయన ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే ఆయన పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తుండటం గమనార్హం.

కాగా... 28 డిసెంబర్ 1937లో జన్మించిన రతన్ టాటా 1991 - 2012 మధ్య కాలంలో టాటా గ్రూప్ కు ఛైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలో వ్యాపార రంగంలో అనేక రికార్డులను నెలకొల్పారు. ఈ క్రమంలో ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత టాటా సన్స్, టాటా మోటార్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా కెమికల్స్, టాటా స్టీల్ లకు గౌరవ ఛైర్మన్ హోదాను పోందారు.

రతన్ టాటా వ్యక్తిత్వాన్ని ఒకసారి పరిశీలిస్తే... ఆయన ఓ వ్యాపారవేత్త మాత్రమే కాకుండా.. సాధారణమైన జీవితం, అత్యున్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉంటారు. ఇక ఆయన ఉదార గుణం గురించి ఎంత చెప్పుకున్న తక్కువనే అనుకొవాలి. కోట్లాదిమందికి రోల్ మోడల్ గా ఆయన జీవనం సాగిందనేది ఆయన గురించి తెలిసినవారు చెప్పే మాట! ఈ సందర్భంగా... ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం...!

Tags:    

Similar News