పార్సీ మతస్తుడైన రతన్ టాటా అంత్యక్రియలు ఎలా చేస్తున్నారు.. ఎందుకు..?

పార్సీ మతస్తుడైన రతన్ టాటా అంత్యక్రియలు జొరాస్ట్రియన్ సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారా.. లేక, హిందూ సంప్రదాయం ప్రకారం చేస్తారా అనే సందేహానికి తెరదించారు.

Update: 2024-10-10 09:17 GMT

రతన్ టాటా అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షిండే ప్రకటించారు. ఆ సంగతి అలా ఉంటే... పార్సీ మతస్తుడైన రతన్ టాటా అంత్యక్రియలు జొరాస్ట్రియన్ సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారా.. లేక, హిందూ సంప్రదాయం ప్రకారం చేస్తారా అనే సందేహానికి తెర దించారు. దీనిపై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది.

అవును... రతన్ టాటా పార్సీ మతస్తుడు అవ్వడం వల్ల జొరాస్ట్రియన్ సంప్రదాయాల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించాలి! అయితే... నేడు రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయంలోనే నిర్వహించనున్నట్లు తెలిస్తోంది. 2022 సెప్టెంబర్ లో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా హిందూ ఆచారాల ప్రకారమే చేశారు.

అయితే అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. నాడు కోవిడ్-19 మహమ్మారి సమయం కావడంతో మృతదేహాలను దేహాలను దహనం చేసె పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో అంత్యక్రియల ఆచారలపై పార్సీ సమాజం నిషేధం విధించింది. దీంతో... సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు నాడు హిందూ ఆచారాల ప్రకారమే జరిగాయి.

అయితే... ఇప్పుడు అలాంటి నిషేధాలు, కండిషన్లూ ఏమీ లేనప్పటికీ రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారమే చేస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి పార్సీలలో అంత్యక్రియల సంప్రదాయం 3 వేల సంవత్సరాల నాటిదని చెబుతారు. అయితే ఈ పార్సీ సమాజంలో అంత్యక్రియల విధానం చాలా విభిన్నంగా ఉంటుంది.

ఈ సాంప్రదాయం ప్రకారం... మృతదేహాన్ని కాల్చడం కానీ పాతిపెట్టడం కానీ ఉండదు. ఈ మతాచారం ప్రకారం... మరణం తర్వాత టవర్ ఆఫ్ సైలెన్స్ అని పిలవబడే సంప్రదాయ స్మశానవాటికలో డేగలు, రాబందులు తినడానికి శరీరాన్ని బహిరంగం ప్రదేశంలో వదిలేస్తారు. ఇది పార్సీ సమాజ ఆచారంలో ఓ భాగం!

అయితే... టవర్ ఆఫ్ సైలెన్స్ కు సరైన స్థలం లేకపోవడంతో పాటు డేగలు, రాబందులు వంటి పక్షలు దాదాపుగా అంతరించిపోవడంతో.. గత కొన్నేళ్లుగా పార్సీ సమాజంలో ప్రజలు అంత్యక్రియల తీరును మార్చుకొవడం ప్రారంభించారు. వాస్తవానికి వీరి పద్దతి ప్రకారం అంత్యక్రియల్లో 6 దశలు ఉంటాయి.

ఇందులో భాగంగా ముందుగా భౌతికకాయానికి స్నానం చేయించి.. తెలుగు రంగు దుస్తులు ధరింపచేస్తారు. దుష్టశక్తులు దాడిచేయకుండా ప్రార్థనలు చేస్తారు. ఆ సమయంలో ప్రేతాత్మలను ఎదుర్కోవడానికని ఓ శునకాన్ని తీసుకొచ్చి భౌతికకాయం పక్కన ఉంచుతారు. ఇక రెండో దశలో.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సందర్శనార్థం ఉంచుతారు.

ఈ సమయంలో అతడు చేసిన తప్పులేమైనా ఉంటే క్షమించాలని కోరతారు. ఇక మూడోదశలో ఆ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇక నాలుగో దశలో... జోరాస్ట్రియన్ సంప్రదాయం ప్రకారం టవర్ ఆఫ్ సైలెన్స్ కి తీసుకెళ్లి.. అక్కడ ఏకాంత ప్రదేశంలో మృతదేహాన్ని ఉంచుతారు. ఆ సమయంలో మృతదేహాన్ని డేగలు, రాబందులు ఆరగిస్తాయి.

ఇక ఐదో దశలో మూడు రోజుల పాటు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ మూడు రోజుల్లోనూ శరీరం నుంచి ఆత్మ వేరుపడుతుందని ఫారసీలు నమ్ముతారు. ఇక చివరి దశలో భాగంగా... ఆ వ్యక్తి మరణించిన నాలుగో రోజు, పదో రోజు, పదమూడో రోజు సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Tags:    

Similar News