రతన్ టాటా వారసుడి రేసులో ముగ్గురి పేర్లు!

ఆయన సామ్రాజ్యానికి వారసులు ఎవరు అనగానే మూడు పేర్లు తెరపైకి వస్తున్నాయి.

Update: 2024-10-10 11:30 GMT

రతన్ టాటా 86 ఏళ్ల వయసులో మరణించారు. దీంతో... ఆయన అనంతరం టాటా సన్స్ వంటి భారీ సామ్రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే.. రతన్ టాటాకు వివాహం కాలేదు.. పిల్లలు లేరు! దీంతో.. ఆయన మరణానంతరం ఆ ఆస్తికి వారసులు ఎవరు.. ఆయన సామ్రాజ్యానికి వారసులు ఎవరు అనగానే మూడు పేర్లు తెరపైకి వస్తున్నాయి.

అవును... దేశం గర్వించదగ్గ వ్యాపారవేత్తల్లో ఒకరైన దిగ్గజం రతన్ టాటా మరణానంతరం.. ఆయన వారసుడు ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. అయితే... విడాకుల అనంతరం రతన్ టాటా తండ్రి ఓ స్విస్ మహిళ ను వివాహం చేసుకున్నారు. వారికి జన్మించిన కుమారులలో ఒకరు నోయెల్ టాటా.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా.. రతన్ టాటా అంత్యక్రియల గురించి నోయెల్ టాటాతోనె మాట్లాడారని అంటున్నారు. అమిత్ షా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారని నోయెల్ టాటాకు చెప్పారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే... రతన్ టాటాకు పిల్లలు లేనందున.. ఆయన ఆస్తి సవతి సోదరుడు నోయెల్ టాటా & కో కే చేరే అవకాశం ఉంది!

అయితే... నోయెల్ టాటాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు నావల్ టాటా, లియో టాటా, మాయ టాటా. వీరి ఒక్కొక్కరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...!

మాయ టాటా:

రతన్ టాటా సవతి సోదరుడైన నోయెల్ టాటా కుమార్తె మాయా టాటా. రతన్ టాటా ఆస్తి ఈమెకే దక్కే అవకాశం ఉందని అంటున్నారు. 34 ఏళ్ల మాయ.. బేయెస్ బిజినెస్ స్కూల్, వార్విక్ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు పోందారు. అనంతరం టాటా ఆపర్చునిటీ ఫండ్ తో కెరీర్ ను ప్రారంభించారు.

ఆ తర్వాత టాటా డిజిటల్ కు మారిన మాయా... "టాటా న్యూ" యాప్ ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు. ప్రస్తుతం ఆమె తోబుట్టువులతో కలిసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పనిచేస్తున్నారు.

నావల్ టాటా:

రతన్ టాటా సామ్రాజ్యానికి వారసుడిగా చూసే వారిలో మాయా టాటా వారసుడు నెవెల్లి టాటా కూడా ఉన్నారు. 32 ఏళ్ల నెవెల్లే టాటా.. టయోటా కిర్లోస్కర్ గ్రుప్ వరసురాలు మాన్సీ కిర్లోస్కర్ ను వివాహం చేసుకున్నరు. టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్ కు నెవిల్లే నాయకత్వం వహిస్తున్నారు.

అంతక ముందు ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ బెవరేజ్ విభాగం నిర్వహణ బాధ్యతలు చూశారు. అందులో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న అనంతరం... జూడియో, వెస్ట్ సైడ్ ల బాధ్యతలు దక్కాయి.

లియో టాటా:

రతన్ టాటా వారసుల జాబితాలో వినిపిస్తున్న మరో పేరు లియో టాటా. మాయా టాటా, నెవిల్లే టాటా ల సోదరి లియో టాటా... ఈ గ్రూప్ లోని హోటల్స్ వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నారు. స్పెయిన్ లోని ఐఈ బిజినెస్ స్కూల్ నుంచి విద్యనభసించిన ఆమె.. తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలెస్ లను చూస్తున్నరు. ఇదే సమయంలొ ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలనూ నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News