ఏపీలో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ ?
ఇంతలా పోలింగ్ జరగడం ఒక రికార్డు అని అంటున్నారు. అయితే ఇంత పట్టుదలగా పోలింగ్ కి వచ్చి ఓటింగ్ చేయడం దేనికి సంకేతం అన్న చర్చ వస్తోంది.
ఏపీలో ఈసారి భారీ పోలింగ్ కి అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. దానికి ఉదాహరణగా పోస్టల్ బ్యాలెట్ ని చూపిస్తున్నారు. 2019లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్తులు రెండున్నర లక్షల మంది ఓట్లేస్తే ఈసారి ఆ సంఖ్య డబుల్ అయింది. ప్రతీ జిల్లాలో ఉద్యోగుల ఓటింగ్ తో సెంట్ పర్సెంట్ పోలింగ్ నమోదు అయింది.
ఇంతలా పోలింగ్ జరగడం ఒక రికార్డు అని అంటున్నారు. అయితే ఇంత పట్టుదలగా పోలింగ్ కి వచ్చి ఓటింగ్ చేయడం దేనికి సంకేతం అన్న చర్చ వస్తోంది. ఉద్యోగుల పోలింగ్ విషయం చూస్తే కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. నడవలేని వారు, ఒంట్లో బాగులేని వారు సైతం ఓటు హక్కు వినియోగించుకుందామని ఆరాటం కనబరచడం చూస్తే వారికి ప్రస్తుత ప్రభుత్వం మీద అభిమానం ఎక్కువగా అయినా ఉండాలి లేదా మార్పు కోరుకుంటున్నారు అయినా ఉండాలని అంటున్నారు.
అయితే పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగులు వేసిన ఓటింగ్ మీద రకరకాలైన విశ్లేషణ సాగుతోంది. ఉద్యోగులలో కూడా పార్టీల పరంగా విడిపోయిన నేపధ్యం ఉందని దాంతో అటూ ఇటూ ఓట్లు దండీగా పడ్డాయని పోటా పోటీగా వచ్చి మరీ ఓట్లేయడం దానికే నిదర్శనం అంటున్నారు.
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగుని ఒక చిన్న సైజు నమూనాగా తీసుకుంటే రేపటి రోజున అసలు పోలింగులో కూడా ఇలాగే జనాలు విరగబడి ఓట్లేస్తారా అన్న చర్చ సాగుతోంది. జనాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు అంటే ఒక సంకల్పం తోనే వస్తారని అంటున్నారు.
మరి భారీ పోలింగ్ ఏపీలో జరిగితే అది కూడా దేనికి సంకేతం అని కూడా మరో చర్చకు ఆస్కారం ఇచ్చేలా ఉంటుంది. అయితే పోటాపోటీగా రాజకీయ పార్టీల మధ్య పోరు సాగుతున్నపుడు వారూ వీరూ కూడా ఓటర్లను చైతన్య పరచి బూతులకు తీసుకుని రావడం గతంలోనూ జరిగింది అని అంటున్నారు.
ఇక ఏపీలో ప్రతీ ఒక్క ఓటింగు కీలకం అని అంటున్నారు. ఒక్క ఓటు తేడా అయితే మొత్తం ఏపీ రాజకీయం మారిపోతుంది అన్న బెంగ కలవరం రాజకీయ పార్టీలకు ఉంది. అందుకే వారు పోస్టల్ బ్యాలెట్ ని కూడా ఎక్కడా వదలలేదని అంటున్నరు. మొత్తం మీద చూస్తే ఈసారి ఏపీలో భారీ పోలింగ్ ఖాయమని అంటున్నారు. 2019లో దాదాపుగా ఎనభై శాతం దగ్గర పోలింగ్ జరిగినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈసారి అది కాస్తా ఏ ఎనభై అయిదు శాతం గానో ఉంటే మాత్రం రాజకీయ లెక్కలు కూడా మారిపోతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.