గ్రామ సచివాలయాలకు ఇకపై ఆ పని తీసేసిన బాబు!
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల సంగతి తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల సంగతి తెలిసిందే. ఆ సచివాలయాల్లో వైసీపీ సర్కార్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే... తాజాగా వాటిని రద్దుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ విధానానికి క్రయ, విక్రయదారుల నుంచి స్పందన తక్కువగా ఉందనే కారణంతో ఆ విధానం రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అవును... గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానం రద్దుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. గడిచిన రెండేళ్లలోలోనూ సుమారు 3,700 గ్రామ సచివాలయాల్లో ఈ విధానం ప్రారంభించగా.. ఇప్పటివరకూ 5,000 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయని అంటున్నారు. దీనివల్ల అదనపు ఖర్చు, మ్యాన్ పవర్ వేస్టేజ్ తో పాటు పలు టెక్నికల్ ప్రాబ్లంస్ వస్తున్నాయనేది అధికారులు చంద్రబాబుకు చెప్పారని అంటున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువలను త్వరలో పెంచనున్నారు. ఈ మేరకు తాజాగా సచివాలయంలో రిజిస్ట్రేషన్ శాఖపై నిర్వహించిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. కనిష్టంగా 10% నుంచి గరిష్టంగా 20% వరకూ రిజిస్ట్రేషన్ల విలువలు పెంచనున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో ఈ పెంపుపై అధ్యయనం చేసిన అనంతరం అంతిమ నిర్ణయం ప్రకటిస్తారు.
కాగా...పట్టన్న ప్రాంతాల్లో ఏటా ఆగస్టు 1న, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ల విలువలు పెంచుతారు. ఆ క్రమంలోనే గత వైసీపీ పాలనలోనూ 2019లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 10-20%, 2020లో ఎంపిక చేసిన పట్టణాల్లో 10-20%, 2022లో జిల్లా కేంద్రాల్లో 20% రిజిస్ట్రేషన్ విలువలు పెంచారు. ఈ నేపథ్యంలోనే మరో నెల, నెలన్నర రోజుల్లో బాబు సర్కార్ కూడా రిజిస్ట్రేషన్ విలువలు పెంచనుందని అంటున్నారు!