బాబు రేవంత్ భేటీ...కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున డిస్కషన్

కానీ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిల భేటీ విషయంలో తెలంగాణా కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది.

Update: 2024-07-04 11:37 GMT

ఇద్దరూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. విభజన సమస్యలు పదేళ్ళుగా పెండింగులో ఉన్నాయి. వాటి మీద చర్చించేందుకు ముఖా ముఖీ భేటీ అవసరమే. కానీ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిల భేటీ విషయంలో తెలంగాణా కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. అది పాజిటివ్ గా కాదు నెగిటివ్ గానే ఉంది.

దానికి కారణం రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం అంతా టీడీపీతో ముడిపడి ఉండడం. అంతే కాదు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఉండడం. వీటితో పాటు అతి కీలకమైన అంశం ఏమిటి అంటే రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు తెలంగాణా మీద ఆంధ్రా పెత్తనం చలాయిస్తారు అని విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడ్వాంటేజ్ గా ఎక్కడ తీసుకుంటారో అని ఆలోచనలు.

ఇలా చూస్తే కనుక రెండు తెలుగు రాష్ట్రాల సీఎం ల మధ్య జరిగే సమావేశం హైప్ ని హోప్ ని క్రియేట్ చేయకపోగా కొత్త రాజకీయం తెలంగాణా కాంగ్రెస్ లో నడుస్తోంది. ముఖ్యంగా చూస్తే చంద్రబాబు ఎన్డీయేలో ఉన్నారు. ఆయన అత్యంత కీలకంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎన్డీయేకు బద్ధ వ్యతిరేకి. కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉంది.

ఇది రాజకీయంగా చూస్తే ఒక భిన్నమైన వాతావరణాన్ని సూచిస్తోంది. మరో వైపు చూస్తే విభజన హామీల విషయం తీసుకుంటే రెండు రాష్ట్రాలు పట్టుదల మీదనే ఉంటాయి. ఎవరి లెవెల్ లో వారు తగ్గే చాన్స్ ఉండదు. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో బిగిస్తారు. అలాంటప్పుడు ఈ మీటింగ్ వల్ల ఉపయోగం ఏమిటి అన్న చర్చ నడుస్తోంది.

Read more!

దానికంటే ఎక్కువగా రాజకీయ నష్టం చేకూరుస్తుందని అంటున్నారు. చంద్రబాబు టీడీపీ తెలంగాణాలో ఉంది. ఆయన రాజకీయంగా బలపడేందుకు చూస్తారు. పైగా ఎమోషన్స్ ని రెచ్చగొట్టి ఆంధ్రా సెంటిమెంట్ ని రాజేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెడీగా ఉన్నారు. ఇది తెలంగాణాలో కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజీ పరంగా అసలు మంచిది కాదు అని కాంగ్రెస్ లోని రెడ్లు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ ద్వారా తెలంగాణకి అయితే వచ్చే లాభం ఏమి ఉంటుందో తెలియదు కానీ కేసీఆర్ ని తట్టి లేపినట్లు అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో సైతం అలజడి రేగుతోంది అని అంటున్నారు. ఇక ఇద్దరు నేతలూ ఓటుకి నోటు కేసులో ఉన్నారు. కాబట్టి అసలు చర్చ రెండు రాష్ట్రాల ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాల అన్న చర్చ కూడా సాగుతోందిట.

ఏది ఏమైనా కేంద్రం పెద్దన్నగా ఉండి రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను తీర్చాలి. అలా జరిగితే బాగుంటుంది. అపుడు రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అని అంటున్నారు. అలా కాకుండా ఒకే స్టేచర్ కలిగి ఎవరి స్టేట్ కి వారు అధిపతులుగా ఉంటూ జరిపే ఈ భేటీలో తేలేది ఏమి ఉంటుందని అంటున్నారు.

తెలంగాణా ఏపీకి బకాయిలు చాలా పడింది. వాటిని కేసీఆర్ పదేళ్ల కాలంలో ఇవ్వలేదు అనేక కారణాలు చెప్పుకొచ్చారు. ఇపుడు వాటిని రేవంత్ రెడ్డి ఆమోదిస్తే అపుడు బీఆర్ఎస్ నుంచి నిరసన మొదలవుతుంది. అలాగే ఆస్తుల పంపకంలోనూ ఎన్నో వాదనలు అటూ ఇటూ ఉన్నాయి. ఇదే విధంగా అనేక ఇతర సమస్యల వెనక సెంటిమెంట్లూ ఉన్నాయి.

వీటిని పరిగణనలోకి తీసుకోకుండా హామీలు ఇచ్చి వస్తే అది రేవంత్ రెడ్డికే కాదు కాంగ్రెస్ కి కూడా దెబ్బ పడుతుందని అంటున్నరు. ఏది ఏమైనా ఈ భేటీ వల్ల చంద్రబాబు రేవంత్ రెడ్డి సాధించేది ఏమీ ఉండదని అంటున్నారు. మరో వైపు పొలిటికల్ గా చన్రబాబుకు పోయేది ఏమీ లేదు కానీ రేవంత్ రెడ్డి ఈ భేటీ లో ఏమైనా ఏపీ అడ్వాంటేజ్ తీసుకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అంటున్నారు. అందువల్లనే ఈ భేటీ ఎందుకు అవసరమా అన్న చర్చ కూడా వస్తోంది. మరి ఈ భేటీ తరువాత మరెంత చర్చ సాగుతుందో చూడాలి.

Tags:    

Similar News

eac