మాటకు మాట.. కేసీఆర్ ను ఉతికేసిన రేవంత్

దీనికి రేవంత్ ఏమని సమాధానం ఇస్తారన్న ఆసక్తి అందరిలో వ్యక్తమైంది. తెలంగాణ సీఎం తనపై చేసిన వ్యాఖ్యలకు దిమ్మ తిరిగే రీతిలో బదులిచ్చారు రేవంత్.

Update: 2023-11-10 03:59 GMT

మాటకు మాట. ఏ మాత్రంతగ్గేదెలే.. అన్నట్లుగా పంచ్ కు డబుల్ పంచ్ ఇచ్చేసిన ఫైర్ బ్రాండ్ రేవంత్ వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధినేతల నోటి నుంచి వస్తున్న మాటలు తూటాల్లా పేలుతున్నాయి. తాజాగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్. "తెలంగాణను విచ్చిన్నం చేయాలి..అనిశ్చితి స్రష్టించాలని సమైక్యాంధ్రులు.. వారి తొత్తులు తీవ్రంగా ప్రయత్నించారు. అలాంటి కుట్రదారుల్లో రేవంత్ ఒకడు. ఎమ్మెల్యేల కొనుగోలుకు వెళ్లి రూ.50 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి కామారెడ్డిలో నాపై పోటీకి దిగాడు. అతన్ని చిత్తుగా ఓడించాలి" అని ఫైర్ అయ్యారు.

దీనికి రేవంత్ ఏమని సమాధానం ఇస్తారన్న ఆసక్తి అందరిలో వ్యక్తమైంది. తెలంగాణ సీఎం తనపై చేసిన వ్యాఖ్యలకు దిమ్మ తిరిగే రీతిలో బదులిచ్చారు రేవంత్. "అమ్ముకునేటోడు కేసీఆర్ అయితే నమ్ముకున్నోళ్లను కాపాడేది నేను. రాజ్యసభ సీట్లు అమ్ముకున్న సన్నాసి నా గురించి మాట్లాడతాడా? పార్థసారథి రెడ్డి.. వద్దిరాజు రవిచంద్రల నుంచి రూ.500 కోట్లు తీసుకున్నాడు. ఎర్రబెల్లి కుట్ర వల్లే నేను జైలుకు వెళ్లాను. శత్రువులతో కలిసి దెబ్బ తీశాడు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కావాలో.. పదేళ్లుగా తెలంగాణను దోచుకుంటున్న బీఆర్ఎస్ కావాలో ఆలోచించండి. కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి.. తెలంగాణలో నాలుగుకోట్ల మంది ప్రజల మధ్య యుద్ధం జరుగుతోంది" తీవ్రంగా విరుచుకుపడ్డారు.

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అంతే ధీటుగా రేవంత్ సమాధానం ఇచ్చారన్న మాట వినిపిస్తోంది. కెలికి మరీ కేసీఆర్ తప్పు చేశారంటున్నారు. రూ.50లక్షల మాటకు రూ.500 కోట్ల ప్రతిమాటకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంటుందని చెబుతున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసిన సమయంలో పార్థసారధి రెడ్డికి సీటు కేటాయింపు ఎపిసోడ్ లో పెద్ద ఎత్తున విస్మయం వ్యక్తమైంది. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన వారికి వరించాల్సిన రాజ్యసభ స్థానం.. ఏనాడు తెలంగాణ గురించి మాట్లాడని వ్యక్తి.. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి భూమిక పోషించని వ్యాపారవేత్తకు సీటును ఎలా కట్టబెడతారన్న ప్రశ్నలు వచ్చాయి. తాజాగా రేవంత్ మాటలతో వాటికి సమాధానాలు లభించాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News