సిగ్గు.. శరం ఉంటే హరీశ్ రాజీనామా చేయాలి.. సీఎం రేవంత్ నిప్పులు

పాయింట్ పట్టుకుంటే వదిలి పెట్టకుండా విరుచుకుపడే తత్త్వం తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు ఎక్కువ.

Update: 2024-08-16 05:31 GMT

పాయింట్ పట్టుకుంటే వదిలి పెట్టకుండా విరుచుకుపడే తత్త్వం తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు ఎక్కువ. అదును చూసి అడ్డంగాబుక్ చేసే ఆయన.. రైతులకు పంద్రాగస్టు లోపు రుణమాఫీ అమలు చేస్తామని సవాలు విసరటం.. దీనికి ప్రతిగా మాజీ మంత్రి హరీశ్ రావు రియాక్టు అయి.. సీఎం రేవంత్ చెప్పిన గడువు లోపు రైతుల రుణమాఫీని అమలు చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామంటూ ధీమాగా సవాలు విసిరారు.

అయితే.. ఈ సవాలును సీరియస్ గా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రుణమాఫీ అమలుపై ఎక్స్ ప్రెస్ విధానంలో నిర్ణయాలు తీసుకోవటం.. డబ్బుల్ని ప్రొక్యూర్ చేయటం చేసేవారు. జులై చివరి వారంలోనే రుణమాఫీ హామీ అమలు మీద ఫోకస్ చేసిన సీఎం రేవంత్.. అంతకు ముందు చెప్పినట్లే రుణమాఫీ అమలుకు అవసరమైన నిధుల్ని జారీ చేశారు.

దీంతో.. తాజాగా ఒక సభలో మాట్లాడిన సీఎం రేవంత్.. మాజీ మంత్రి హరీశ్ రావుపై నిప్పులు చెరిగారు. వైరాలో ఏర్పాటు చేసిన రుణమాఫీ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సవాలుగా తీసుకున్నట్లుగా సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మాటను నిలబెట్టటానికి లెక్కలు వేసి మరీ హామీని నెరవేర్చారన్న విషయాన్ని సీఎం రేవంత్ వెల్లడించారు.

రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీశ్ సవాలు విసిరిన వైనాన్ని ప్రస్తావించిన రేవంత్.. ‘‘రుణమాఫీ చేస్తే హరీశ్ రావు సవాలు విసిరారు. ఆయన తన మాటను నిలబెట్టుకోవాలి. సిగ్గు.. శరం ఉంటే వెంటనే హరీశ్ రాజీనామా చేయాలి’’ అంటూ డిమాండ్ చేయటం గమనార్హం.

హరీశ్ రావు తన పదవికి రాజీనామా చేస్తే.. సిద్ధిపేటకు పట్టిన పీడ వైదొలుగుతుందన్న సీఎం రేవంత్.. ‘‘హరీశ్ రావు తాను చెప్పినట్లే అమరవీరుల స్థూపం వద్దకు వచ్చిన ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Tags:    

Similar News