జగన్ కి తొలి షాక్ ఇచ్చిన రేవంత్...!
అదే టైం లో ఏపీ నుంచి తెలంగాణాకు బాకీ ఉందని దాన్ని వసూలు చేయించేలా చూడాలని కేంద్రాన్ని కోరడం విశేషం.
తెలంగాణా సీఎం గా నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్ కి తనదైన షాక్ ఇచ్చారా అంటే దాని మీదనే రాజకీయ చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఆయన కేంద్ర మంత్రులతో వరస భేటీలు వేశారు.
ఈ సందర్భంగా తెలంగాణాకు ఏమి రావాల్సి ఉన్నవి వాటిని కోరారు. అదే టైం లో ఏపీ నుంచి తెలంగాణాకు బాకీ ఉందని దాన్ని వసూలు చేయించేలా చూడాలని కేంద్రాన్ని కోరడం విశేషం. అలా రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో జగన్ కి షాక్ ఇచ్చారనే అంటున్నారు.
రేవంత్ రెడ్డి తన తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు ఏపీ నుంచి రావాల్సిన 408 కోట్ల రూపాయలు వసూలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం హాట్ టాపిక్ గా మారింది. విభజన జరిగిన తర్వాత కూడా ఏపీ ఏపీ తెలంగాణ ఆస్తులను ఉపయోగించింది అన్నది రేవంత్ రెడ్డి వాదన ఉంది. అందువల్ల దీని కోసం ఏపీ తెలంగాణకు 408 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని లెక్క తేల్చి మరీ ఆయన కేంద్రం ముందు పెట్టారు. ఏపీ నుంచి కేంద్రం ఈ బకాయిలు వసూలు చేయాలని రేవంత్ రెడ్డి కోరడం విశేషం.
ఇంతకీ ఏపీ వినియోగించుకున్నది హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) వంటి భవనాలు అని అంటున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులు వసూలు చేయాలని కేంద్రాన్ని రేవంత్ రెడ్డి కోరారు. ఇలా ఎందుకు వసూల్ చేయాలీ అంటే ఇవన్నీ కూడా విభజన చట్టంలో ప్రస్తావించని సంస్థలుగా ఆయన పేర్కొన్నారు. అంటే ఇవన్నీ తెలంగాణా ఆస్తులుగా ఆయన కేంద్రం ముందు ఎస్టాబ్లిష్ చేశారు అన్న మాట.
దాంతో ఏపీ నుంచి తమకు ఈ మొత్తం రావాల్సిందే అని ఆయన కేంద్రం ముందు ప్రతిపదన పెట్టేశారు. అలా తన ఢిల్లీ పర్యటనలోనే రేవంత్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తొలి షాక్ ఇచ్చారని రాజకీయ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఇక సీఎం హోదాలో అధికారిక పర్యటన తొలిసారిగా జరిపిన రేవంత్ రెడ్డి తెలంగాణా రాష్ట్రానికి మెట్రో రీలైన్‌మెంట్, కొత్త ఇళ్లకు నిధులు, పాలమూరు-ఆర్‌ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు జాతీయ ప్రాజెక్టు హోదా వంటివి కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని కలిసిన సందర్భంగా తెలంగాణా సీఎం కోరారు.
అంతే కాదు హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రత్యేకంగా 9,100 కోట్ల రూపాయలతో 26 కిలోమీటర్ల మేర బీహెచ్‌ఈఎల్-లక్డీకాపూల్, నాగోల్-ఎల్‌బీ నగర్ కారిడార్లు, 32 కిలోమీటర్ల మేర ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్-రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కారిడార్‌ల రీ అలైన్‌మెంట్ అవసరమని కేంద్రానికి రేవంత్ రెడ్డి వివరించి చెప్పారు.
అలా 6 వేల 250 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌ను పరిశీలించాలని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. అదనంగా, వినోద ఉద్యానవనాలు, జలపాతాలు, పిల్లల నీటి క్రీడలు, వ్యాపార కేంద్రాలు మరియు షాపింగ్ కాంప్లెక్స్‌ల వంటి ఫీచర్లను కలుపుతూ హైదరాబాద్‌లోని మూసీ రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను ఆయన కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఈ
రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని . ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇళ్లను ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేయాలని కొత్త ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
ఇవన్నీ పక్కన పెడితే ఏపీ తెలంగాణకు ఇన్ని వందల కోట్లు బకాయి ఉన్నట్లుగా ఎపుడూ గత పదేళ్ళలో ప్రస్తావనకు కనీసంగా రాలేదు. మరి రేవంత్ రెడ్డి ఈ వివరాలు ఎలా బయటకు తీశారో కానీ సీఎం జగన్ కే షాక్ ఇచ్చారు అని అంటున్నారు. దీన్ని బట్టి తెలంగాణాకు దక్కే ప్రతీ పైసాకు తాను కస్టోడియన్ ని అని ఆయన జనాలకు తెలియచేశారు అని అంటున్నారు.