కార్పొరేట్ కాలేజీలపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
ఈ నేపథ్యంలో... కార్పొరేట్ కాలేజీలకు ముక్కుతాడు వేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైందని అంటున్నారు.
విద్యారంగంలో కార్పొరేట్ కాలేజీల అక్రమాలపైనా, అధిక ఫీజులపైనా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లితండ్రుల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో సీఎం రేవంత్ కి కూడా ఒక ఆలోచన ఉందని చెబుతున్నారు. ఈ వరుస ఫిర్యాదుల నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది!
అవును... తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల అక్రమాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని.. అధిక ఫీజులు వసూలు చేస్తూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని.. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని.. విద్యార్థుల తల్లితండ్రుల నుంచి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో... కార్పొరేట్ కాలేజీలకు ముక్కుతాడు వేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైందని అంటున్నారు.
ఇందులో భాగంగా... ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి, కార్పొరేట్ కాలేజీలలో ఫీజులను నియంత్రించాలనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుందని అంటున్నారు! ఈ మేరకు.. ఇప్పటికే ఏయే కార్పొరేట్ కాలేజీలు ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నాయనే విషయంపై నివేదికలు తెప్పించుకుంటున్నారని.. ఆ కాలేజీలను వెంటనే నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారని సమాచారం!
పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత కార్పొరేట్ కాలేజీల విద్య, వసూలు చేస్తోన్న ఫీజులు,కల్పిస్తోన్న వసతులు మొదలైన అంశాలపై అధ్యయనం చేసి.. అసెంబ్లీలో చర్చించిన పిమ్మట ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు సూచనప్రాయంగా చెబుతున్నాయి!
వాస్తవానికి విద్యారంగంలోకి కార్పొరేట్ శక్తులు రంగప్రవేశం చేసిన తర్వాత వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందనే చర్చ చాలాకాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పైగా.. విద్య అంటే మార్కులు, ర్యాంకులు అనే సంస్కృతికి కారణం ఈ శక్తులే అని.. విద్య అంటే కేవలం బుక్ రీడిం, ఎగ్జాం రైంటింగ్ కాదనే విషయాన్ని అవి పూర్తిగా విసర్జించాయని విమర్శకూడా బలంగా ఉంది. ఇక ఫీజుల పేరు చెప్పి జరుగుతున్న దోపిడీ సంగతి సరేసరి!
ఉదాహరణకు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్యకు డే స్కాలర్ విద్యార్థి నుంచి ప్రతీ ఏడదీ సుమారు 1,50,000 నుంచి 3 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నారని.. ఈ క్రమంలో రెండో ఏడాది ల్యాబ్ నిర్వహణ పేరుతో మరో 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ఈ విషయాలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త చట్టం తేబోతున్నట్లు తెలుస్తుంది!