అధిష్టానాన్ని ఐస్ చేయడంలో రేవంత్ ముదిరిపోయాడుగా
ఈ ఇద్దరు కాంగ్రెస్ మహిళ నేతల పరస్పర కామెంట్లు వైరల్‌గా మారిన తరుణంలోని ఏఐసీసీ ఛీఫ్ మల్లిఖార్జున ఖర్గే స్థానికతను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో స్థానికత అంశం కీలకపాత్రం పోషిస్తుండడంతో ఈ గడ్డ వారసులుగా తమను తాము ప్రాజెక్ట్స్ చేసుకోవడంలో నాయకులు బిజీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్‌టీపీని విలీనం చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల తాను తెలంగాణ కోడలు అని పేర్కొంటుండగా అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుక చౌదరి తెలంగాణ బిడ్డను అంటూ ప్రకటించుకుంటున్నారు. ఈ జాబితాలోకి తాజాగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున కాంగ్రెస్ చేరారు. అయితే, ఆయన్ను ఈ జాబితాలో చేర్చింది రేవంత్ రెడ్డి గమనార్హం.
అధికార బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు తామే బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రొజెక్ట్ చేసుకుంటుండగా, మిగతా పార్టీలు సైతం ఈ మేరకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే షర్మిల తన స్థానికత గురించి ప్రకటించగా ఆమెకు కౌంటర్ గా రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ మహిళ నేతల పరస్పర కామెంట్లు వైరల్‌గా మారిన తరుణంలోని ఏఐసీసీ ఛీఫ్ మల్లిఖార్జున ఖర్గే స్థానికతను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన బిడ్డగా ఖర్గేను పేర్కొంటూ ఆయన స్థానికుడే అవతారని అందుకే సిడబ్ల్యుసి సమావేశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను తన చాతుర్యంతో తనకు అండగా నిలిచేలా చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ జాబితాలోకి ఖర్గేను చేర్చారని అంటున్నారు. తెలంగాణ & హైదరాబాద్ స్థానికత అంశాన్ని ఇప్పుడు అన్ని పార్టీలు కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఢిల్లీ పెద్దల స్థానికత అంశంగా వారి మనసు గెలుచుకునేలా రేవంత్ భలే స్కెచ్ వేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.