ఇది రేవంత్ కు షాకింగ్ న్యూస్ !

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో ఓటమి పాలు కావడం జీర్ణించుకోలేని అంశమే.

Update: 2024-06-04 12:14 GMT

సొంత జిల్లాలో రేవంత్ రెడ్డికి మరోసారి పరాభవం ఎదురయింది. రెండు రోజుల క్రితం స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పరాజయం పాలయ్యాడు. అది మరవక ముందే ఈ రోజు వెల్లడయిన లోక్ సభ ఫలితాలలో బీజేపీ అభ్యర్థి డీకె అరుణ 3636 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో ఓటమి పాలు కావడం జీర్ణించుకోలేని అంశమే.

ఇక్కడ విజయం సాధించడం కోసం రేవంత్ ఎనిమిది సార్లు పర్యటించి బహిరంగసభలు నిర్వహించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని క్యాబినెట్ స్థాయి పదవులు కూడా కట్టబెట్టినా ఇక్కడ పరాభవం తప్పలేదు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారే ఉండటం గమనార్హం.

5 మంది ఎమ్మెల్యేలు మాత్రమే నాగర్ కర్నూలు లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి దాదాపు 94,361 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. కానీ సీఎం సొంత నియోజకవర్గంలో పరాభవం ఎదురుకావడం గమనార్హం. మరో వైపు రేవంత్ సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరిలోనూ బీజేపీ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడం రేవంత్ కు ఇబ్బంది కలిగించే అంశమే.

Tags:    

Similar News