రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం ?

సిక్స్ గ్యారెంటీస్ అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

Update: 2024-03-14 07:45 GMT

సిక్స్ గ్యారెంటీస్ అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సిక్స్ గ్యారెంటీస్ హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే సిక్స్ గ్యారెంటీస్ ను అమల్లోకి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే జనాలకు హామీలిచ్చారు. తెలంగాణా వ్యాప్తంగా జరిగిన బహిరంగసభల్లో ఇదే విషయాన్ని చాలాసార్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోపే నాలుగు హామీలను అమల్లోకి తెచ్చారు. మిగిలిన రెండింటిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇపుడు ప్రభుత్వం సమస్య ఏమిటంటే వివిధ సంక్షేమపథకాల లబ్దిదారుల్లో అనర్హులను ఏరేయాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. ఇందుకు ఎలాంటి పద్దతిని అవలంభించాలనే విషయమై ఉన్నతాధికారులు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారు. అధికాదాయవర్గాలు, భూస్వాములు, ప్రభుత్వంలో పెద్దస్ధాయిలో పనిచేస్తున్న అధికారుల కుటుంబాలు కూడా పథకాల లబ్దిదారులుగా ఉన్నారని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఇలాంటి వాళ్ళని ఏరేస్తే నిజమైన అర్హులను లబ్దిదారుల పరిధిలోకి తీసుకురావచ్చన్నది రేవంత్ ఆలోచన. బోగస్ లబ్దిదారులను ఏరేస్తేనే నిజమైన లబ్దిదారులకు న్యాయం జరిగినట్లవుతుందని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకున్నట్లవుతుందని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసమని లబ్దిదారుల ప్యాన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం పెద్దలు పరిశీలిస్తున్నారు. ఎలాగంటే ప్రతిఏడాది ప్రభుత్వంలో పనిచేస్తున్నవారు ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేస్తారు. అలాగే వివిధ వ్యాపారాలు చేస్తున్నవారు, వివిధ వృత్తుల్లో అధికాదాయం ఉన్న వాళ్ళు కూడా ఆదాయపన్ను చెల్లించాల్సిందే. వీళ్ళ ప్యాన్ కార్డుల ఆధారంగా ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఎంతమంది అనర్హులు బయటపడతారో చూడాలి. ఊర్లలో పొలాలను సాగుచేయిస్తు లేదా కౌలుకి ఇచ్చిన భూస్వాములు లేదా ప్రభుత్వం, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా అనేక రూపాల్లో పథకాల్లో లబ్దిపొందుతున్నారు.

ఇలాంటి వాళ్ళందరినీ ఏరేయాలంటే ప్యాన్ కార్డును, ఆదాయపు పన్ను రిటర్నులను పరిశీలించటమే మార్గమని ఇప్పటికే ఉన్నతాధాకారులు రేవంత్ కు రిపోర్టు ఇచ్చారట. దీన్ని మంత్రులతో చర్చించిన తర్వాత రేవంత్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు. నిజంగానే ఈ ప్రతిపాదన ఆచరణలోకి వచ్చి సక్రమంగా అమలైతే వేలాదిమంది అనర్హులు లబ్దిదారుల జాబితాల నుండి బయటకు పోవటం ఖాయం. అప్పుడు ప్రభుత్వానికి, నిజమైన అర్హులకు మేలు జరుగుతుందనటంలో సందేహంలేదు.

Tags:    

Similar News