ఏపీ ఎన్నికల ఫలితాలపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇదే క్రమంలో... కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన పీసీసీ చీఫ్ షర్మిళ గెలుపుపైనా స్పందించారు.

Update: 2024-05-15 05:19 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాలపై రకరకాల ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఫలితాలు తెలియాలంటే జూన్ 4వరకూ వేచి ఉండక తప్పని పరిస్థితి. ఈ సమయంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో... కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన పీసీసీ చీఫ్ షర్మిళ గెలుపుపైనా స్పందించారు.

చంద్రబాబుకు లబ్ది చేకూర్చేందుకు రేవంత్ రెడ్డి తన సోదరి షర్మిలను రిమోట్‌ కంట్రోల్ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఇటీవల హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ ఈ వ్యాఖ్యలపై కాస్త ఘాటుగానే స్పందించారు. ఇందులో భాగంగా... "సొంత చిన్నాన్న హత్య గురించి వాళ్లు చెబుతున్నారు. జగన్ నా మీద చేసిన ఆరోపణలకు విలువ లేదు. పక్క రాష్ట్ర సీఎం జగన్‌ కు ఓ సూచన.. ముందుగా మీ తల్లి, చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వండి" అని అన్నారు.

ఇదే సమయంలో... తాను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని అని చెబుతూ.. తన రాష్ట్ర ప్రయోజనాలు తనకు ముఖ్యం అని రేవంత్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో... చంద్రబాబుతో తనకు వ్యక్తిగత సంబంధాలే తప్ప రాజకీయ సంబంధాలు లేవని క్లారిటీ ఇచ్చారు! ఇది ఎన్నికల ముందు రియాక్షన్ కాగా... పోలింగ్ పూర్తయిన తర్వాత తాజాగా మరోసారి రేవంత్ స్పందించారు. ఇందులో భాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కడప లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల గెలుస్తుందని చెప్పారు. ఇదే సమయంలో... ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే.. మంచి సంబంధాలు కొనసాగిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. ఇదే క్రమంలో... తెలంగాణలో ఇక ఎలక్షన్సూ, పాలిటిక్సూ ముగిశాయన్న రేవంత్.. ఇక తన ఫోకస్ అంతా పాలనపైనే అని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News