టీడీపీ పోటీ చేసి ఉంటే... రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో టీడీపీ పోటీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఆసక్తికర రాజకీయాలు నడుస్తున్నాయి. ఏపీలో విపక్షం లేనట్లుగానే పరిస్థితి ఉంటే... తెలంగాణలో కూడా రేవంత్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో టీడీపీ పోటీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా టీడీపీ పోటీలో లేకపోవడం కాంగ్రెస్ కు కలిసొచ్చిందన్నట్లుగా వ్యాఖ్యానించారు.
అవును... గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేఇ ఉంటే... అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోనని సందేహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి! తెలంగాణలో పోటీ చేసి ఉంటే.. టీడీపీ కనీసం 10% ఓట్లు దక్కించుకునేదని.. అప్పుడు తమ పార్టీ గెలుపోటములపై ఆ నెంబర్ కచ్చితంగా ప్రభావం చూపించేదని అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో... ఏపీలో చంద్రబాబు పాలిటిక్స్ పైనా రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఏపీలో చంద్రబాబుకు గతంలో 23 సీట్లే వచ్చినా.. ఆయన కోర్ పాలిటిక్స్ ను వదలకుండా పోరాడారని.. అందుకే తిరిగి గెలవగలిగారని అన్నారు. అయితే... తెలంగాణలో మాత్రం కేసీఆర్ పరిస్థితి అలా లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే... ఒక్కపనీ పూర్తిచేయలేమని చెప్పిన రేవంత్ రెడ్డి.. అందులో కేవలం కేసీఆర్, ప్రభుత్వ సంస్థలు ఒక్కటే ఉండవని.. ఒక్కసారి కేసు నమోదైతే బ్యాంకులు ఒక్క రూపాయీ రుణం ఇవ్వవని తెలిపారు. ఇదే సమయంలో ఇప్పటికే ఇచ్చిన అప్పులు తీర్చమని ఒత్తిడి తెస్తాయని అన్నారు. ఫలితంగా రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి పెట్టడానికీ ఎవరూ రారని రేవంత్ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... జగన్ ఇంటిముందు కూల్చివేతలు చంద్రబాబు చెప్పడం వల్లే చేయించినట్లు ప్రచారం జరుగుతుందని.. అయితే తనకు ఎవరూ చెప్పకుండానే ఆ పనిచేశామని రేవంత్ అన్నారు! ఇక హైదరాబాద్ కు అమరావతి పోటీ కాదని రేవంత్ పేర్కొన్నారు. ఇదే సమయంలో... చంద్రబాబు నాయుడిని కించపరిచేలా మాట్లాడనని.. అనాల్సిన అవసరం కూడా తనకు లేదని రేవంత్ స్పష్టం చేశారు.