ఆ విషయంలో రేవంత్ నంబర్ వన్ !

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు వివిధ రకాలుగా వేతనాలు ఉంటాయి.

Update: 2024-06-16 02:30 GMT

దేశంలో కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు కొలువుదీరిన నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు వివిధ రకాలుగా వేతనాలు ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రికి బస, వాహనం, భద్రతతోపాటు దేశ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్లే వెసులుబాటు ఉంటుంది.

దేశంలోని అనేక రాష్ట్రాలు తమ సొంత ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్లను కలిగి ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌తో పాటు పలువురు మంత్రులు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎవరికైనా ఉపయోగించుకోవచ్చు. కానీ సాధారణంగా ముఖ్యమంత్రి సమయాన్ని ఆదా చేయడానికి, రహదారి-రైల్వే భద్రతకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి తక్కువ దూర ప్రయాణాలకు కూడా హెలికాప్టర్లను వినియోగిస్తారు. రాష్ట్రం నుండి బయటకు వెళ్లడానికి విమానాలను ఉపయోగిస్తారు. రాష్ట్రానికి ఎన్నికైన ముఖ్యమంత్రి అనేక ప్రత్యేక అధికారాలను కలిగి ఉంటారు.

త్రిపుర ముఖ్యమంత్రికి దేశంలోనే అత్యల్ప జీతం రూ.1.05 లక్షలు పొందుతుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి అత్యధికంగా రూ.4.10 లక్షల వేతనం అందుకుంటున్నారు. తెలంగాణ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రికి రూ.3.90 లక్షలు మూడవ స్థానంలో యూపీ ముఖ్యమంత్రి వేతనం కింద రూ.3.60 లక్షలు తీసుకుంటున్నారు.

రాష్ట్రాల వారీగా ఏ సీఎంకు ఎంత జీతం?

తెలంగాణ ముఖ్యమంత్రి –రూ.4,10,000

ఢిల్లీ ముఖ్యమంత్రి – రూ.3,90,000

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి -రూ.3,65,000

మహారాష్ట్ర ముఖ్యమంత్రి -రూ.3,40,000

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి -రూ.3,35,000

గుజరాత్‌ ముఖ్యమంత్రి – రూ.3,21,000

హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి -రూ.3.10,000

హర్యానా ముఖ్యమంత్రి – రూ.2,88,000

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి -రూ.2,55,000

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి- రూ.2,30,000

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి -రూ.2,30,000

పంజాబ్‌ ముఖ్యమంత్రి- రూ.2,30,000

గోవా ముఖ్యమంత్రి – రూ.2,20,000

బీహార్‌ ముఖ్యమంత్రి – రూ.2,15,000

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి – రూ.2,10,000

తమిళనాడు ముఖ్యమంత్రి – రూ.2,05,000

కర్ణాటక ముఖ్యమంత్రి – రూ.2,00,000

సిక్కిం ముఖ్యమంత్రి – రూ.1,90,000

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి - రూ.1,75,000

ఒడిషా ముఖ్యమంత్రి – రూ.1,60,000

రాజస్థాన్ ముఖ్యమంత్రి - రూ.1,75,000

కేరళ ముఖ్యమంత్రి - రూ.1,85,000

అస్సాం ముఖ్యమంత్రి - రూ.1,25,000

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి - రూ.1,33,000

మేఘాలయ ముఖ్యమంత్రి రూ.1,50,000

Tags:    

Similar News