రేవంత్ ప్లాన్ కు పనులు మొదలుపెట్టిన అధికారులు!
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ రేవంత్ రెడ్డి... పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ రేవంత్ రెడ్డి... పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజా సమీక్షలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా... గత బీఆరెస్స్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం - ఎయిర్ పోర్టు కారిడార్ ను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సమయంలో... రాయదుర్గం - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కారిడార్ ను మార్చడంపై గణనీయమైన దృష్టి సారించి, ముందు ప్రతిపాదించిన మార్గాలను విస్మరించి కొత్త మార్గాల కోసం ప్రణాళికలను రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు! ఈ సమయంలో... మెట్రో రాకను ఆశించి భూముల్లో పెట్టుబడులు పెట్టిన రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వ్యాపారులు ఈ మార్పుతో గట్టిగా దెబ్బతినే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఈ సమయంలో... రాయదుర్గం - శంషాబాద్ కారిడార్ కోసం ఫలక్ నుమా, ఎల్‌బీనగర్ నుంచి మెట్రో మార్గం కోసం సర్వే నిర్వహించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోపక్క డీపీఆర్ సిద్ధమై టెండర్ (ఎల్-1) ఎంపిక ప్రక్రియలో ఉండగానే కారిడార్ ను మార్చడంపై అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని తెలుస్తుంది.
ఇదే సమయంలో... సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఫలక్ నుమా, ఎల్‌బీ నగర్ నుంచి పాతబస్తీ వరకు మెట్రో రైలును పొడిగించే లక్ష్యంతో క్షేత్రస్థాయి సర్వేకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మార్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రోను పొడిగిస్తే ఐటీ కారిడార్ తో పాటు నగరంలోని మధ్య, తూర్పు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తుంది.
కాగా... ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఇప్పటికే స్పందించిన రేవంత్ రెడ్డి... 111 జీవో పరిధిలో మెట్రో అలైన్మెంట్ ఎలా చేశారని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 111 జీవో పరిధిలో అభివృద్ధికి అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపారు. ఓ.ఆర్.ఆర్.ఆర్. ద్వారా ఎయుర్ పోర్ట్ కు మంచి రవాణా సదుపాయం ఉన్న నేపథ్యంలో... అవసరమైతే.. విమానాశ్రయ మెట్రోలకు ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు.
ఇదే సమయంలో ప్రధానంగా... పాతబస్తీలో అధిక జనాభా దృష్ట్యా మెట్రో అలైన్మెంట్ ఉండాలని సీఎం అన్నారు. ఇదే సమయంలో ఎంజీబీఎస్, ఫలక్ నుమా, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట నుంచి కొత్త మెట్రో అలైన్ మెంట్ ఉండాలని సూచించారు.