మోడీని కాపీ కొడుతున్న రేవంత్ రెడ్డి ?

రేవంత్ రెడ్డి రీసెంట్ గా ఇచ్చిన స్టేట్మెంట్లు అలాగే ఉంటున్నాయి. మోడీ మాదిరిగా రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ డైలాగులు చెబుతూండడంతో ఈ చర్చ వస్తోంది.

Update: 2024-08-15 15:30 GMT

అదేంటి రేవంత్ రెడ్డి ఏంటి మోడీని కాపీ కొట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. పైగా రేవంత్ రెడ్డి తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ సీఎం. బీజేపీకి చెందిన దేశ ప్రధానమంత్రి మోడీని ఆయన ఎలా కాపీ కొడతారు అన్నది కూడా చర్చగానే ఉంటోంది. కానీ తీరు చూస్తే అలాగే ఉంటోంది అని అంటున్నారు.

రేవంత్ రెడ్డి రీసెంట్ గా ఇచ్చిన స్టేట్మెంట్లు అలాగే ఉంటున్నాయి. మోడీ మాదిరిగా రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ డైలాగులు చెబుతూండడంతో ఈ చర్చ వస్తోంది. నేను రాష్ట్రాలతో పోటీ పడడం లేదు ప్రపంచంతో పోటీ పడుతున్నాను అని రేవంత్ రెడ్డి సినిమాటిక్ గా చెబుతున్న డైలాగుల గురించి అంతా చర్చించుకుంటున్నారు.

అయితే రాష్ట్రాలు రాష్ట్రాలతోనే పోటీ పడతాయి. దేశాలు దేశాలతో పోటీ పడుతాయి అని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో అలా అన్నారో అన్నది పక్కన పెడితే ఆయన మోడీ తరహాలో గంభీరమైన ప్రకటనలే ఇస్తున్నారు అని అంటున్నారు. మోడీ వరకూ చూస్తే కనుక ఆయన భారత్ ని వికసిత్ భారత్ అంటున్నారు. 2047 నాటికి దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని అంటున్నారు.

ఏకంగా భారత్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తామని అంటున్నారు. అంతే కాదు ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీసుకుని వెళ్తామని ఆర్థిక వృద్ధి రేటు బాగా పెరిగేలా చూస్తామని కూడా కొత్త లక్ష్యాలను ప్రకటిస్తున్నారు

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలాగే పవర్ ఫుల్ గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రానున్న పదేళ్ల కాలంలో తెలంగాణాను ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కలిగిన స్టేట్ గా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి గట్టిగానే చెబుతున్నారు ఇవన్నీ మోడీ మాటలు ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లుగానే ఉన్నాయని అంటున్నారు. మోడీ మాదిరిగా రేవంత్ రెడ్డి ఈ తరహా స్టేట్మెంట్లు ఇస్తూ ఒక విధంగా కాపీ కొడుతున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది.

మోడీ ప్రపంచంలో భారత్ అగ్ర భాగంలో పెడతాను అంటే రాష్ట్రాలతో తనకు పోటీ కాదు ప్రపంచంతోనే అని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. నిజమే లక్ష్యాలు మంచివే. టార్గెట్ ఉంటేనే ఎవరైనా దూసుకుని పోయేది. కానీ అవి శుష్కమైనవి కాకూడదు. అంతే కాదు అవి ఆచరణకు అందేలా ఉండాలి. ఆ దిశగా అడుగులు పడుతున్నాయా లేదా అన్నది చూసుకోవాలి.

అదే సమయంలో ఆ సామర్ధ్యానికి సరిపడా వనరులు అందిస్తున్నామా అన్నది కూడా చూసుకోవాలి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి తెలంగాణాను నవ శకానికి దగ్గర చేయాలని చూస్తున్నారు. మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి ఎన్నో ఆశలు ఉండవచ్చు. ఆయనకంటూ ఒక విజన్ ఉండవచ్చు. ఇపుడు ఆయనకు అంతా సానుకూలంగా ఉంది. దాంతో ఆయనకు వయసు కూడా కలసి వస్తోంది. దాంతో ఆయన తనదైన మార్క్ ని చూపించాలని తపన పడుతున్నారు.

ఆ దిశగా అడుగులు వేయాలని అనుకుంటున్నారు. ఇది మంచి పరిణామమే పోటీ పడే విషయంలో ఎవరిని స్పూర్తిగా తీసుకున్నా తప్పు లేదు. కానీ టార్గెట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. లేకపోతే అవి స్టేట్మెంట్స్ గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. మోడీ అయితే ఎన్నో హామీలు ఇచ్చారు. మరెన్నో ప్రకటనలూ ఇస్తూ వచ్చారు. కొన్ని మాత్రమే సాకారం చేయగలిగారు. మరో అయిదేళ్ళ కాలం ఆయనకు అధికారం ఉంది. దాంతో మోడీ ఏమి చేస్తారో చూడాలి. అలాగే రేవంత్ రెడ్డి తనకు లభించిన అవకాశాన్ని ఎలా వాడుకుంటారో కూడా చూడాల్సి ఉంది.

Tags:    

Similar News