వంటమనిషిని ఉద్యోగం మానేయాలన్న రేవంత్!
గడిచిన పదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును.. పాలనా విధానాల్ని.. ఆయన తీసుకునే నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి.
కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ సరికొత్త అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు ఇస్తున్నారు. ఆయన పాలనపై పెద్దగా అంచనాలు లేని వేళ.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే ప్రభుత్వం మీద గౌరవ మర్యాదల్ని పెంచేలా చేస్తున్నాయి. మరోవైపు.. వ్యక్తిగతంగా రేవంత్ వ్యవహరిస్తున్న తీరు చూసిన వారు.. ఆ వివరాలు తెలిసిన వారు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. గడిచిన పదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును.. పాలనా విధానాల్ని.. ఆయన తీసుకునే నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి.
చేతికి ఎముక అన్నది లేకుండా ఖర్చు చేయటం.. ఆడంబరాలకు పోయి ఎడా పెడా అప్పల్ని చేసిన వైనం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేడిపండు మాదిరి మారిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పుడున్నరియల్ బూమ్ ను కొనసాగించటం తప్పించి.. ఖర్చుల విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించకపోతే మొదటికే మోసం వస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఇలాంటి వేళ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రేవంత్.. పాలనలోనూ.. వ్యవహారశైలిలోనూ తనదైన ముద్రను వేస్తున్న రేవంత్ వ్యవహారశైలి అధికార వర్గాల్లోనూ.. మీడియా సర్కిల్స్ ను హాట్ టాపిక్ గా మారింది.అయితే.. చాలా విషయాలు బయటకు రాకపోవటం.. తగినంత చర్చ జరగకపోవటంతో ఆయన ఇమేజ్ పెరగాల్సినంత పెరగటం.. రావాల్సినంత క్రేజ్ రాలేదని చెప్పాలి. తాజాగా వెలుగు చూసిన వైనం చూస్తే..చాలా రోజుల తర్వాత కొత్త తరహా ముఖ్యమంత్రిని చూసిన ఫీలింగ్ రావటం ఖాయం.
ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ కు భోజన సమయంలో ఆయన వంట చేసే వ్యక్తి తెచ్చిన కొత్త ఫుడ్ చూసి.. ఇవెక్కడివి అని అడిగితే.. తెలంగాణ భవన్ నుంచి వచ్చినట్లుగా చెప్పారట. అయితే.. రేపటి నుంచి నువ్వు పనిలోకి రావాల్సిన అవసరం లేదని చెప్పటంతో ఆ వంట మనిషి కంగుతిన్న పరిస్థితి. తనకు ఎక్కడి నుంచి భోజనం వద్దని.. తన సొంతభోజనమే తాను తింటానని చెప్పిన రేవంత్.. తనకు ఎప్పటిలానే వంట చేయాలని వంటవాడికి చెప్పారట. ఇలా ఖర్చు విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. దుబారాకు చెక్ పెడుతున్న రేవంత్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి