చంద్ర బాబు ఎవరో నాకు తెలియదు...ఆర్జీవీ హాట్ కామెంట్స్...!

తన మైండ్ లో ఫస్ట్ టైం చంద్రబాబు పేరు రిజిస్టర్ అయిందే ఒక వెన్నుపోటు దారుడిగా అని సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచిన తరువాతనే బాబు ఫ్యామస్ అయ్యారని అన్నారు.

Update: 2023-12-24 03:48 GMT

చంద్రబాబు ఎవరో నాకు తెలియదు అంటూ టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. తన మైండ్ లో ఫస్ట్ టైం చంద్రబాబు పేరు రిజిస్టర్ అయిందే ఒక వెన్నుపోటు దారుడిగా అని సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచిన తరువాతనే బాబు ఫ్యామస్ అయ్యారని అన్నారు.

ఎన్టీయార్ ని బ్యాడ్ చేసి ఆయన కుర్చీ లాక్కున్న చంద్రబాబు ఆయన చనిపోయాక మాత్రం దేవుడు అంటూ పొగడడం అంటే ఆయన వ్యూహాలు ఎలాంటివో అన్నది తనకు ఆశ్చర్యంగా ఉంటుందని అన్నారు. చంద్రబాబు రైటో రాంగో ఎన్టీయార్ ని వెన్నుపోటు పొడిచారు. ఆయనకు ఎన్టీయార్ నచ్చలేదు. అలాగే ఈ రోజు దాకా ఉండవచ్చు కదా, మళ్ళీ ఆయన ఫోటోకు విగ్రహాలకు దండలేంటి ఆ కీర్తించడం ఏంటి.

ఎన్టీయార్ ఫ్యాన్స్ కోసమే ఇదంతా అని తెలుస్తోంది కదా. అంటే బయటకు ఒకటి లోపల ఒకటి ఇలా చెప్పే వారు చేసే వారు వ్యూహాలను బట్టబయలు చేయడమే తన వ్యూహం సినిమా అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో సూపర్ స్టార్ పొలిటికల్ గా మాత్రం ఏమీ కారని అన్నారు. ఆయన బర్రెలక్క కంటే కూడా వెనకబడి ఉండడానికి కారణం ఆయన అవలంబిస్తున్న పొలిటికల్ వైఖరి అన్నారు. బర్రెలక్క బర్రెలకు కాసుకుంటే పవన్ తానే ఒక బర్రెగా టీడీపీ అధినాయకత్వానికి మారిపోయారని అన్నారు.

పవన్ కి తాను అందరి కంటే పెద్ద ఫ్యాన్ అని ఆయన అంటే ఒకపుడు ఇష్టమని ఇపుడు అసలు లేదని ఆర్జీవీ కుండబద్ధలు కొట్టారు. ఇక చినబాబు లోకేష్ చంద్రబాబు కొడుకు కాకపోతే నథింగ్ అనేశారు. ఆయన ఒక సాధారణ టీడీపీ కార్యకర్త దగ్గర బాయ్ గా చేయడానికి కూడా పనికిరాడని హాట్ కామెంట్స్ చేశారు.

లోకేష్ ఎక్కడా గెలిచిందీ లేదని, ఆయన మాత్రం మహానుభావుడి మాదిరిగా మాట్లాడుతారని ఆర్జీవీ విమర్శించారు. ఎర్ర బుక్ ఒకటి పెట్టుకుని అందరి జాతకాలు తేలుస్తాను అంటున్న లోకేష్ కి ప్రజాస్వామ్యం తెలుసా అని ఆర్జీవీ ప్రశ్నించారు. ఉత్తర కొరియా ప్రెసిడెంట్ నియంత అయిన కిమ్ కూడా ఇలా ఎర్ర బుక్ అని ఎవరినీ బెదిరించడేమో అని ఆర్జీవీ సెటైర్లు వేశారు. ఇంతకీ లోకేష్ దగ్గర ఉన్నది ఎర్ర బుక్కా లేక ఎర్రి బుక్కా అని నిలదీశారు.

మొత్తానికి చూస్తే తాను పవన్ చంద్రబాబు లోకేష్ ల వ్యక్తిత్వాలను గుడ్డలూడదీసి చూపించేందుకే వ్యూహం సినిమా తీశాను అని చెప్పేశారు. తాను వైసీపీ కో వర్ట్ అని అంటున్నారు. తాను జగన్ అంటే ఇష్టపడతాను అని అలా కుండబద్ధలు కొట్టినట్లుగా తాను చెబుతూంటే మళ్లీ కోవర్ట్ అని అనడమేంటి అని ఆర్జీవీ ప్రశ్నించారు. ఈ నెల 29న సినిమా రిలీజ్ ఖాయమని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు లోబడే సినిమా తీశానని సెన్సార్ బోర్డు తన సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చిందని ఆర్జీవీ చెప్పారు.

Tags:    

Similar News