రోహిత్ @ వింబుల్డన్... హిట్ మ్యాన్ లుక్ అదుర్స్!
అవును... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ అనంతరం దొరికిన విరామాన్ని ఆస్వాదిస్తున్నాడు
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాలిడెను ఎంజాయ్ చేస్తునాడు. టీ20 ప్రపంచకప్ సాధించిన ఆనందాన్ని అనుభవిస్తున్న రోహిత్ తాజాగా సరికొత్త లుక్ లో కనిపించాడు. నిత్యం నీలి రంగు జెర్సీతో కనిపించే ఈ హిట్ మ్యా ప్రస్తుతం సూటూ బూటూ వేసుకుని, కొత్త గెటప్ లో హల్ చల్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో లండన్ పర్యటనకు వెళ్లిన రోహిత్.. వింబుల్డన్ టోర్నమెంట్ లో తళుక్కుమన్నాడు.
అవును... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ అనంతరం దొరికిన విరామాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో లండన్ టూర్ లో ఉన్న హిట్ మ్యాన్ తాజాగా ఓ వింబుల్డన్ మ్యాచ్ కు హాజరయ్యాడు. కార్లోస్ అల్కరాజ్, డెనిల్ మొద్వెదెవ్ మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన రోహిత్ శర్మ అదిరిపోయే లుక్ లో తళుక్కున మెరిశాడు. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
సూటు, బూటు, టై, స్టైలిష్ కళ్ల జోడుతో రాయల్ గా కనిపించిన రోహిత్ శర్మ.. వింబుల్డన్ రాయల్ బాక్స్ లో ప్రత్యక్షమయ్యాడు. ఈ సమయంలో రోహిత్ రాయల్ లుక్ కు సంబంధించిన ఫోటోలను వింబుల్డన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. "రాయల్ బాక్స్ లో టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్" అని దీనికి క్యాప్షన్ జోడించింది.
దీంతో ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న రోహిత్ ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. హిట్ మ్యాన్ అభిమానులు ఈ ఫోటోలను చూసి తెగ సంబరపడితోతూ షేర్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది.
కాగా... ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ సేన సౌతాఫ్రికాను ఓడించి ప్రపంచకప్ ను ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ తో పాటు విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజాలు ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు.