7 ఓ క్లాక్‌ బ్లేడ్‌ తో కోసుకుని చస్తానన్నాడు అతనేనా : రోజా

అలాంటి వాళ్ల గురించి ఏం చెప్తాం అన్నారు. మహిళలు స్వయంశక్తితో ఎదుగుతుంటే ఇలాంటి వారు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

Update: 2024-02-29 11:23 GMT

జనసేనాని పవన్‌ కళ్యాణ్, ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ పై ఏపీ పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజాపై ఇటీవల బండ్ల గణేశ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ఆమెను కోరగా ఎవరతను అంటూ సెటైర్లు వేశారు. 7 ఓ క్లాక్‌ బ్లేడ్‌ తో కోసుకుని చస్తానన్నాడు అతనేనా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాంటి వాళ్ల గురించి ఏం చెప్తాం అన్నారు. మహిళలు స్వయంశక్తితో ఎదుగుతుంటే ఇలాంటి వారు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన నేతలకు ఇది వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అందుకే వాళ్లను మహిళలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పై కూడా మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం సిగ్గు చేటు కాదా? అని నిలదీశారు. పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టి ఎన్నాళ్ళయిందని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తూ అథ: పాతాళానికి వెళ్ళింది పవన్‌ కల్యాణేనన్నారు. బూత్‌ కమిటీలు మనకు ఉన్నాయా అంటూ కేడర్‌పై మండిపడడం సిగ్గు చేటని రోజా ధ్వజమెత్తారు.

పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి చంద్రబాబు చుట్టూ తిరుగుతున్న పవన్‌ ఇప్పుడు పార్టీ కేడర్‌ను తప్పుబట్టడం ఏంటని రోజా నిలదీశారు. పార్టీ పెట్టి పదేళ్లైనా.. 24 సీట్లకే పోటీ చేసే దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

పవన్‌ కల్యాణ్‌ ఫ్రస్ట్రేష్టన్‌ పీక్స్‌ కు చేరిందన్నారు. పార్టీ పెట్టి పదేళ్లైనా 24 సీట్లకే పోటీ చేస్తున్నారని సెటైర్లు వేశారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని స్టేజ్‌లో ఉన్నాడన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ ను విమర్శించే అర్హత పవన్‌ కల్యాణ్‌ కు లేదన్నారు. చంద్రబాబు మాయలో పవన్‌ పూర్తిగా పడిపోయారన్నారు. బాబుకు ఊడిగం చేస్తూ పవన్‌ పాతాళంలోకి కూరుకుపోయారని ధ్వజమెత్తారు.

పార్టీ అధ్యక్షుడైనా పవన్‌ ఇంతదాకా మండల, బూత్‌ కమిటీలు వేయలేదని రోజా గుర్తు చేశారు. 24 సీట్లు తీసుకొని... జనసేన నేతలకు పవన్‌ అన్యాయం చేశారన్నారు. తన తప్పును కార్యకర్తలపై రుద్దాలని పవన్‌ ప్రయత్నిస్తున్నారని ఇది సిగ్గుచేటని అన్నారు. గట్టిగా అరిచినంత మాత్రాన ఓట్లు పడవని పవన్‌ గుర్తించాలన్నారు.

రుషికొండలో వరల్డ్‌ క్లాస్‌ టూరిజం భవనాలను నిర్మించామని రోజా తెలిపారు. అందులో సీఎం క్యాంప్‌ కార్యాలయం ఉంటే బాగుంటుందని త్రిసభ్య కమిటీ సూచించిందన్నారు. ముఖ్యమంత్రి అంగీకరిస్తే అది క్యాంప్‌ కార్యాలయం అవుతుందని.. లేదంటే టూరిజం భవనాలుగా ఉంటాయన్నారు.


Full View


Tags:    

Similar News