రష్యా - ఉక్రెయిన్ 1000 రోజుల వార్... మిగిల్చిన ఘోరాలివే!
సెప్టెంబర్ 1939 నుంచి సెప్టెంబర్ 1945 వరకూ జరిగిన అత్యంత ఘోరం గురించి తెలిసిందే.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం. ఒకప్పుడు కేవలం ఈ రెండు దేశాలకే పరిమితమైన ఈ యుద్ధం.. ఇప్పుడు తన పరిధిని విస్తరించుకుంటుంది.. తాజాగా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో... ప్రపంచం ముందు ఓ అణు యుద్ధం ముప్పును ఉంచిందనే చర్చ తెరపైకి వచ్చింది.
సెప్టెంబర్ 1939 నుంచి సెప్టెంబర్ 1945 వరకూ జరిగిన అత్యంత ఘోరం గురించి తెలిసిందే. అదే.. రెండో ప్రపంచ యుద్ధ సమయం. సుమారు 70 నుంచి 80 మిలియన్ల మంది మరణించినట్లు చెప్పే ఈ ఘోరం తర్వాత ఐరోపాలో చోటు చేసుకున్న అత్యంత భీకరమైన ఘర్షణ ఏదైనా ఉందంటే.. అది రష్యా – ఉక్రెయిన్ యుద్ధం అనే చెప్పాలి.
ఈ యుద్ధం మొదలై 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఈ యుద్ధంలో లక్షల అమంది సైనికులు, వేలాది మంది సాధారణ ప్రజలు మృతి చెందగా.. కొన్ని లక్షల మంది గాయపడ్డారు. ఇక ఉక్రెయిన్ లో పలు నగరాలు ధ్వంసమవ్వగా.. ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. 1000 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఈ యుద్ధం మిగిల్చిన విషాదం లెక్కలు తెరపైకి వచ్చాయి.
అవును... నానాటికీ ముదురుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఈ యుద్ధ తీవ్రతను చూస్తుంటే... మూడో ప్రపంచ యుద్ధానికి, అణు యుద్ధానికి ఇది కీలక కారణం కాబోతుందనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఇప్పటికే ఈ ఘోరం మిగిలిచిన నష్టాల అంచనాలు తెరపైకి వస్తున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దామ్!
తాజా అంచనాల ప్రకారం... రష్యా సైనిక నష్టం సంఖ్య సుమారు 7,25,000 ఉంటుందని అంటున్నారు. ఇందులో సుమారు రెండు లక్షల మందికి పైగా మృతులు ఉండగా.. సుమారు నాలుగు లక్షల మందికి పైగా గాయపడినవారు ఉన్నారని అంటున్నారు. అంటే.. సగటున రోజుకు 725 మంది రస్యా సైనికులు మరణించడం లేదా గాయపడటం జరిగాయన్నమాట.
అయితే... ఇప్పుడు ఆ సగటు సంఖ్య పెరుగుతుందని.. ఇప్పుడు రోజుకు సగటున 1,500 నుంచి 2,000 మంది వరకూ సైన్యాన్ని రష్యా కోల్పోతుందని అంటున్నారు. ఫలితంగా... ఏడాది ముగిసే నాటికి సుమారు 8,00,000 మంది సైన్యాన్ని కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తునారు!
ఇక ఉక్రెయిన్ విషయానికొస్తే... ఇక్కడ కూడా నష్టం భారీగానే ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా.. ఉక్రెయిన్ దళాలు సుమారు 3,00,000 నుంచి 4,00,000 మందిని ఈ పోర్టులో కోల్పోయినట్లు చెబుతున్నారు. ఇక ధ్వంసమైన నగరాలు, గ్రామాలు అదనం! ఇదే సమయంలో... సామాన్య ప్రజానికం మరణాలు కూడా 60,000 వరకూ ఉండోచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో జననాల రేటు రెండున్నరేళ్ల క్రితం ఉన్న రేటుతో పోలిస్తే ఇప్పుడు మూడో వంతుకు పడిపోయింది. ఇదే సమయంలో సుమారు 40 లక్షల మంది పౌరులు ఉన్న ఉర్లను వదిలి దేశంలోని మరో ప్రాంతానికి వెళ్లిపోయాగా.. సుమారు 60 లక్షల మంది దేశాన్ని విడిచి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారని చెబుతున్నారు.