మోడీ చుట్టూ 'బూట్ల' రగడ.. ఇది చాలా సీరియస్ !
రష్యా సైనికులు ఉక్రెయిన్‌తో సాగుతున్న యుద్ధంలో వినియోగిస్తున్న బూట్లను భారత్ సరఫరా చేస్తోందన్నది అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూ మరో రగడ తెరమీదికి వచ్చింది. ఇది ఇంటర్నల్ ఇష్యూ కాదు. అంతర్జాతీ య వ్యవహారం. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య రెండున్నరేళ్లు యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ యుద్ధం విషయంలో ప్రపంచ దేశాలు తమ తమ విధానాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని.. అయితే రష్యా.. లేకపోతే ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించాయి. భారత్ విషయానికి వస్తే.. ఈ యుద్ధం విషయంలో తాము తటస్థంగా వ్యవహరిస్తామని ఆది నుంచి మోడీ ప్రకటించారు.
రష్యాకు, ఉక్రెయిన్‌కు కూడా.. సమాంతరంగా ఉంటామని.. అయితే.. శాంతియుతంగా సమస్యలు పరిష్క రించుకోవాలని చెప్పారు. యుద్ధంతోనూ.. తుపాకులతోనూ.. బుల్లెట్లతోనూ. సమస్యలు పరిష్కారం కావని కూడా మోడీ చెబుతూ వచ్చారు. ఇటీవల రష్యాలో పర్యటించినప్పుడు కూడా ఇదే విషయంపై చర్చించా నని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు రష్యా-ఉక్కెయిన్ యుద్ధం విషయంలో తటస్థంగా వ్యవహరిస్తానన్న భారత్ వ్యవహారంలో కీలకమైన వ్యవహారాన్ని అంతర్జాతీయ మీడియా బయట పెట్టింది.
రష్యా సైనికులు ఉక్రెయిన్‌తో సాగుతున్న యుద్ధంలో వినియోగిస్తున్న బూట్లను భారత్ సరఫరా చేస్తోంద న్నది అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఒకవైపు తటస్థంగా ఉన్నామని చెబుతున్న భారత్.. రష్యాకు బూట్లను సరఫరా చేయడం ద్వారా.. పరోక్షంగా సహకరిస్తున్నట్టే కదా! అన్నది విశ్లేషకుల మాట. అయితే.. దీనిపై భారత్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. సహజంగా యుద్ధ విషయాలకు సంబంధించి సహకారం.. అందిపుచ్చుకునే విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. మరి వాటి మేరకు సరఫరా చేస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది.
ఎక్కడ తయారవుతున్నాయి?
రష్యా సైనికులు ప్రస్తుతం వినియోగిస్తున్న బూట్లు.. బిహార్‌లోని హాజీపూర్ లో తయారవుతున్నాయి. రష్యా ఆర్మీ.. తమ సైనికుల కోసం హాజీపూర్ బూట్లనే వినియోగిస్తోంది. దీనికి సంబంధించి గత ఏడాది (ఉక్రెయి న్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే) 100 కోట్లరూపాయల ఆర్డర్ భారత్‌కు ఇచ్చినట్టు తెలిసింది.