ఇప్పటికి రైతు బంధే.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
అయితే, వాస్తవానికి కాంగ్రెస్ అదికారంలోకి వస్తే.. రైతు బంధు పథకాన్ని పెంచుతామని, రూ.15000 చోప్పున ఇస్తామని అప్పట్లో పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం 'రైతు బంధు'పథకంపై సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేసీఆర్ అమలు చేసిన రైతు బంధు పథకాన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖజానాలో సొమ్ము ఎంతుందో చూడాలని.. దానిని రైతులకు పెట్టుబడి సాయం కింద అందజేయాలని ఆయన సూచించారు. అధికారుల అంచనా ప్రకారం రేపటి నుంచి రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో పడనున్నాయి.
అయితే, వాస్తవానికి కాంగ్రెస్ అదికారంలోకి వస్తే.. రైతు బంధు పథకాన్ని పెంచుతామని, రూ.15000 చోప్పున ఇస్తామని అప్పట్లో పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు.. కొన్ని రోజులు ఆగండి..రైతులకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు కూడా దీనికి కట్టుబడినప్పటికీ.. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని కొనసాగించాలని.. రైతలుకు ఆ నిధులను అందజేయాలని సూచించారు.
రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని రేవంత్ రెడ్డి సూచించారు. దీని ప్రకారం లబ్ధిదారులైన రరైతులకు ఇప్పుడు అందించే మొత్తానికి అదనంగా మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే అందించనున్నారు. మొత్తానికి అధికారంలోకి వచ్చి నాలుగు రోజులే(శనివారం) అయినప్పటికీ.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం.. రైతులు ఇబ్బంది పడకుండా.. ఎలాంటి భేషజాలకు పోకుండా.. రైతు బంధునే కొనసాగించడం వంటివి ఆసక్తిగా ఉన్నాయి.