నలుగురు భార్యలు, ఇద్దరు, గర్ల్ ఫ్రెండ్స్ పిల్లలు 10, లక్ష్యం 54... ఎవరీ ర్యూతా?

ఈ క్రమంలో జపాన్ లో ఓ వ్యక్తి సరికొత్త లక్ష్యాన్ని పెట్టుకుని, ఆ పనిలో బిజీగా ఉన్నాడు.

Update: 2024-10-20 02:30 GMT

ఈ ప్రపంచంలో చాలా మందికి చాలా రకాల లక్ష్యాలు ఉంటుంటాయి. కొంతమంది ఏ లక్ష్యం లేకుండా బ్రతికేస్తుంటుంటారు! ఆ సంగతి అలా ఉంటే... లక్ష్యాలు ఉన్నవారిలో చాలామంది మాత్రం వాటిని సాధించడానికి అహోరాత్రులూ కష్టపడుతుంటారు. అలసట లేని ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో జపాన్ లో ఓ వ్యక్తి సరికొత్త లక్ష్యాన్ని పెట్టుకుని, ఆ పనిలో బిజీగా ఉన్నాడు.

అవును... జపాన్ లో హక్కైడో కు చెందిన 36ఏళ్ల ర్యూతా వతనాబె అనే వ్యక్తి సుమారు పదేళ్లుగా నిరుద్యోగిగా ఉన్నాడట. ఈ సమయలో అతడు ఓ భారీ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాడు. ఇందులో భాగంగా.. అతను "గాడ్ ఆఫ్ మ్యారేజ్" కావాలని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తన ప్రయాణాన్ని ఇప్పటికే బలంగా ప్రారంభించి, సక్సెస్ ఫుల్ గా కదులుతున్నాడు.

ర్యూతా వతనాబే ఫ్యామిలీ లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటారు. ఇప్పటికే అతనికి నలుగురు భార్యలు, ఇద్దరు గర్ల ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక, నిరుద్యోగిగా ఉన్న వతనాబే.. భార్యలు, స్నేహితురాళ్ల ఆదాయాలపై ఆధారపడి ఉంటాడు. వారే ఇతడి ఆదాయ వనరులు. ఇప్పటికే 10 మంది పిల్లలకు తండ్రి అయిన వతనాబే.. 54 మంది పిల్లలకు తండ్రి అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

వాస్తవానికి వతనాబే భార్యలు అతనితో చట్టబద్ధంగా వివాహం చేసుకోలేదు కానీ.. "కామన్-లా" భాగస్వాములుగా పరిగణించబడతారు. అంటే... అధికారికంగా నమోదు కాకుండా.. వివాహిత జంటల వలే కలిసి జీవిస్తారు.. బాధ్యతలను పంచుకుంటారు. ప్రస్తుతం అతడు ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ.. పిల్లల సంరక్షణను నిర్వహిస్తూ.. గృహిణి పాత్రను సక్సెస్ ఫుల్ గా పోషిస్తున్నాడు.

ఈ సమయంలో తన భార్యల నుంచి నెలవారి ఇంటి ఖర్చుల నిమిత్తం సుమారు 9,14,000 యెన్లు (దాదాపు రూ.5 లక్షలు) తీసుకుంటాడు. వాటితో నెలంతా కుటుంబాన్ని నడుపుతాడు. ఇటీవల అతడు జపనీస్ టీవి షో అబెమా ప్రైమ్ లో తన లైఫ్ స్టైల్ గురించి వివరించాడు. ఈ సందర్భంగా అతడికి "ఆల్ ది బెస్ట్" చెబుతున్నారు నెటిజన్లు!

Tags:    

Similar News