కష్టంలో వస్తే మానవత్వంలో స్పందించారు

ప్రజాభవన్ కు వచ్చే సమయానికి సదరు శిశువు తీవ్రమైన అనారోగ్యంతో ఉండటంతో.. అక్కడే ఉన్న ప్రజాభవన్ నోడల్ అధికారి దివ్య స్పందించారు

Update: 2024-01-31 06:30 GMT

తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ కు వచ్చే వారి నుంచి దరఖాస్తులు తీసుకోవటమే కాదు.. పరిస్థితులకు తగ్గట్లుగా స్పందించే గుణం తమకు ఉందన్న విషయాన్ని తాజా ఉదంతంతో నిరూపించారుప్రజాభవన్ నోడల్ అధికారులు. తాజాగా జియాగూడకు చెందిన ఒక నిరుపేద కుటుంబం నాలుగు నెలల బాబుకు ఆరోగ్యం బాగోవటం లేదని.. గుండెకు రంధ్రం ఉన్న నేపథ్యంలో ఖరీదైన వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవటంతో సాయం కోసం ప్రజాభవన్ కు వచ్చారు.

ప్రజాభవన్ కు వచ్చే సమయానికి సదరు శిశువు తీవ్రమైన అనారోగ్యంతో ఉండటంతో.. అక్కడే ఉన్న ప్రజాభవన్ నోడల్ అధికారి దివ్య స్పందించారు. వారి సమస్యను విన్నంతనే స్టార్ హాస్సిటల్ కు ఫోన్ చేసి.. శిశువు బాధ్యతల్ని వైద్యులకు అప్పజెప్పారు. ప్రభుత్వమే సదరు పసికందు ఖర్చుల్ని భరిస్తుందని.. వెంటనే వైద్య సాయం అందించాలని ఫోన్ లో సమాచారం ఇచ్చారు. అప్పటికప్పుడు అంబులెన్సు ను సిద్ధం చేయించి స్టార్ ఆసుపత్రికి పంపారు.

సాయం కోసం పిటిషన్లు పట్టుకొచ్చిన వారిని.. యంత్రాల మాదిరి వారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరించి.. సాయం చేస్తామన్న హామీ పేరుతో రోటీన్ పని చేసేందుకు భిన్నంగా.. మానవత్వంతో స్పందించి ఆగమేఘాల మీద రియాక్టు అయిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రజాభవన్ అధికారులు స్పందించిన తీరుతో అక్కడకు వినతిపత్రాలు సమర్పించేందుకు వచ్చిన వారంతా హర్షం వ్యక్తం చేయటం గమనార్హం. ఏమైనా.. ఈ తరహా స్పందనపై సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లోనూ వైరల్ గా మారింది.


Tags:    

Similar News