ఎందెందు వెతికినా అందందు గలడు... స్కాంలలో చంద్రబాబే సూత్రధారి!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు 20 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న పరిస్థితి.

Update: 2023-09-29 09:45 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు 20 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న పరిస్థితి. మరోపక్క అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ కేసులో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో 41ఏ నోటీసులు ఇచ్చి విచారించడానికి సీఐడీ అధికారులు సిద్ధపడుతున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో మైకులముందుకు వచ్చిన సజ్జల.. టీడీపీ నేతలను మరిత టెన్షన్ కి గురిచేసే మాటలు చెప్పారు.

ఒకపక్క అధినేత జైల్లో ఉన్నారు, మరోపక్క ఆయన కుమారుడిని అరెస్ట్ చేస్తారనే ఊహాగాణాలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఆ ఊహాగాణాలకు బలం చేకూర్చే సంఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, తెగ టెన్షన్ పడుతున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా అన్ని కేసుల్లోనూ ఆధారాలు పక్కాగా ఉన్నాయని తెలిపారు.

అవును... లక్ష మంది గోబెల్స్ ప్రచారం చేస్తే ఒక చంద్రబాబు అని చెప్పిన ఆయన... టీడీపీ అంటేనే తోడు దొంగల పార్టీ అన్నారు. ఒక మనిషిని నిలువునా దోచుకుని, ఒంటిమీద బట్టలతో సహా లేపేసి, ఆ వ్యక్తి దిగంబరంగా కనిపిస్తున్నా కూడా... అతడి ఒంటిపై బట్టలు ఉన్నాయని వాదించగల నేర్పరితనం బాబుకు ఆయన అనుకూల మీడియాకూ సొంతం అని సజ్జల ఎద్దేవా చేశారు. ఆపార్టీతో పుత్తు ఈ పార్టీతో పొత్తు.. ఎప్పుడు ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా అది చారిత్రక అవసరం అని నమ్మబలికే బ్యాచ్ ఇది అని ఫైరయ్యారు.

చంద్రబాబు అరెస్టై జైలుకి వెళ్లినతర్వాత... అసలు జరిగింది ఏంటి, ఆయన్ని రిమాండ్‌ కి పంపింది ఎవరు అనే ఆలోచన చేయకుండా... ఆఖరికి న్యాయవ్యవస్థ తీర్పుల్ని కూడా అక్రమమని చంద్రబాబు అండ్ కో దొంగల ముఠా చెబుతోందనీ సజ్జల మండిపడ్డారు. నిజానికి ఈ కేసులు, అరెస్టుల్లో వైసీపీ చేసింది ఏమీ లేదని అన్నారు. జైల్లో దోమలు కుడితేనో, ఉక్కబోస్తేనో.. అదేదో భారతదేశ ప్రజాస్వానికే చేటు అన్నట్లుగా వ్యవరిస్తున్నారని ఫైరయ్యారు.

ఇదే సమయంలో న్యాయస్థానాల్లో తప్పు జరిగిందని తేలడం వల్లే రిమాండ్ విధించినప్పటికీ... చంద్రబాబుకి అన్యాయం జరిగిపోతోందని రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారన్న, ఐక్యరాజ్యసమితికి వినతిపత్రం ఇచ్చినా ఆశ్చర్యపడనక్కరలేదని ఎద్దేవా చేశారు. ఈ సానుభూతి ప్రచారాల వల్ల అసలు విషయం పక్కకు పోవాలని పరితపిస్తున్నట్లు ఉందని తెలిపారు.

అవును... బాబు మార్కు గోబెల్స్ ప్రచారం వల్ల అసలు స్కాం విషయం పక్కకుపోయి.. టీడీపీకి అన్యాయం జరిగిపోతోందనే సింపతీని తెప్పించేందుకు ఈ దొంగల ముఠా ప్రయత్నిస్తోందని ఫైరయిన సజ్జల... దొంగతనం చేసి, సానుభూతి కోరుకుంటున్నారని.. ఈ 20 రోజుల్లో లోకేష్ ముఠా నానా యాగీ చేసిందని అన్నారు. ఇదే సమయంలో... మొత్తం 4 కేసుల్లో ఆధారాలు పక్కాగా ఉన్నాయని స్పష్టం చేశారు.

ఈ అమరావతి అనే మహా కుంభకోణంలో... అసైన్ ల్యాండ్స్, ఇన్నర్ రింగు రోడ్డు అలైన్ మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ వంటివన్నీ చిన్న చిన్న స్కాములని.. ఈ కేసుల్లో చంద్రబాబే సూత్రధారి అని సజ్జల తెలిపారు. ఇదే సమయంలో చంద్రబాబు సూత్రదారి అయితే.. నారాయణ, గంటా సుబ్బారావు మొదలైన వారంతా పాత్రధారులు అని అన్నారు.

Tags:    

Similar News