2024 ఎలక్షన్.. బండ్లన్న మళ్ళీ అదే డైలాగ్

కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మీడియా అదే విషయాన్ని బండ్ల గణేష్ దగ్గర ప్రస్తావించింది.

Update: 2023-11-09 04:25 GMT

2018 ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాకుంటే బ్లేడ్ తో గొంతు కోసుకుంటా అంటూ నిర్మాత బండ్ల గణేష్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్టేట్ మెంట్ చాలా ఇంపాక్ట్ చూపించింది. బండ్ల గణేష్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసే వరకు వెళ్ళింది. మీమ్స్ క్రియేట్ చేసి మరి బండ్ల గణేష్ వ్యాఖ్యలని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మీడియా అదే విషయాన్ని బండ్ల గణేష్ దగ్గర ప్రస్తావించింది. ఎన్నికల ముందు స్ఫూర్తి నింపడానికి వంద చెబుతాం. అన్ని జరిగేవి కావు, చేసేవి కాదు అని తేల్చేశారు. ఇప్పటికి మీడియా ఇంటర్వ్యూలలో ఈ టాపిక్ కచ్చితంగా చర్చకి వస్తూ ఉంటుంది. ఇక పొలిటికల్ సర్కిల్ లో, సోషల్ మీడియాలో బండ్ల గణేష్ కి బ్లేడ్ స్టార్ అంటూ ట్యాగ్ ఇచ్చేశారు.

తాజాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మరోసారి బండ్ల గణేష్ తెరపైకి వచ్చాడు. ప్రస్తుతం ఆటను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే గతంలో కేసీఆర్, కేటీఆర్ మీద విమర్శలు చేసినట్లు ఇప్పుడు చేయలేదు. కాని కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలలో అధికారంలోకి వస్తుందని డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రమాణస్వీకారం ఎల్బీ స్టేడియం లో జరుగుతుందని మీడియాతో చెప్పుకొచ్చారు.

ఎల్బీ స్టేడియంలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రమానస్వీకారానికి నేను డాన్స్ లు చేసుకుంటూ వెళ్తా అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పారు. అయితే కేసీఆర్ ని అనేంత స్థాయి నాది కాదని విమర్శలు చేయకుండా తప్పించుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి బండ్ల గణేష్ తన అతిశయోక్తి మాటలతో తెలంగాణ పోలికల్ సర్కిల్ లో చర్చనీయంగా మారిపోయారు.

అయితే గతంలో మాదిరిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినంతగా ఈ సారి బండ్ల గణేష్ చేయడం లేదు. కాని కాంగ్రెస్ పార్టీ మీద తనకున్న విధేయత మాత్రం మీడియా సాక్షిగా చూపిస్తున్నారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైన స్పందించి కౌంటర్ ఇస్తారేమో అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News