అర్జీ కార్ లో అనాథ శవాలను అమ్మేసేవాడు... ఎవరీ సందీప్ ఘోష్?

ప్రధానంగా ఆ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వ్యవహారం తాజాగా వెలుగులోకి షాకింగ్ గా మారింది.

Update: 2024-08-22 03:00 GMT

కోల్ కతాలోని జూనియర్ వైద్యురాలు హత్యాచారనికి గురైన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ప్రధానంగా ఆ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వ్యవహారం తాజాగా వెలుగులోకి షాకింగ్ గా మారింది. ఊహించని విషయాలు తెరపైకి వస్తున్నాయి. అనాథ శవాలను సైతం అమ్మేసేవాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... కోల్ కతా లో రెసిడెంట్ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శలు తాజాగా భారీ ఎత్తున వెల్లువెత్తుతునాయి. అసలు ఆ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చేసిన అవినీతి, అరచాకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనే కామెంట్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా.. ఆయన అవినీతిలో అనాథ శవాలు కూడా భాగమే అనే ఆరోపణ ఇప్పుడు వైరల్ గా మారింది. అతను అనాథ శవాలను కూడా విక్రయించేవాడని.. ఇదే క్రమంలో బంగ్లాదేశ్ కు ఔషదాలను అక్రమంగా ఎగుమతి చేసేవాడని ఓ మాజీ ఉద్యోగి పేర్కొన్నారని తెలుస్తోంది. అలా అమ్మేసే వాటిలో కొత్త సిరంజులు, ఇతర సామాగ్రి ఉండేవని చెబుతున్నారు.

దీంతో వాటి కొరత కనిపించకుండా వాడేసిన సిరంజులు, ఇతర సామగ్రిని రీ సైక్లింగ్ చేసి ఉపయోగించేవారని.. కొన్ని సందర్భాల్లో వాటిని కూడా సొమ్ము చేసుకునేవాడని తెలుస్తోంది. వాస్తవానికి ఇతడి వ్యవహారాలపై గతంలో ఇక్కడే పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గా ఉన్న అక్తర్ అలీ పలు విషయాలపై ఉన్నతాధికరులకు గతంలోనే ఫిర్యాదు చేశారంట.

నాడు ఆయన చేసిన ఫిర్యాదు లేఖలో... ఘోష్, ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వాస్త్ భవన్ అనుమతులు లేకుండానే లీజుకు ఇచ్చేవాడని.. వైద్యశాలకు అవసరమైన పరికరాలు, మందుల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించాడని.. కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చాడని పేర్కొన్నారని తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ ఆరోపణలపై ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఇటీవల అక్తర్ ను విచారణకు పిలిపించింది.. ఈ నేపథ్యంలోనే ఆయన ఫిర్యాదులు ఆధారంగా ఘోష్ పై ఎఫ్.ఐ.ఆర్. నమోదైంది.

Tags:    

Similar News