పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం ‘6’ పేజీల లేఖ

థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయన్న విషయాన్ని పేర్కొంటూ తెలంగాణ పోలీసులకు బదులిచ్చిన సంధ్య యాజమాన్యం సరికొత్త విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించింది.

Update: 2024-12-29 19:30 GMT

ఇప్పటివరకు వెలుగు చూడని కొత్త విషయాన్ని వెల్లడించింది సంధ్య థియేటర్ యాజమాన్యం. ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో రేవతి అనే మహిళ మరణించటం.. మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి నిందితుల జాబితాలో సంధ్య థియేటర్ యాజమాన్యం పేర్లు చేర్చటం.. వారిని అరెస్టు చేయటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయన్న విషయాన్ని పేర్కొంటూ తెలంగాణ పోలీసులకు బదులిచ్చిన సంధ్య యాజమాన్యం సరికొత్త విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించింది.

దీని పరిప్కారం.. డిసెంబరు నాలుగైదు తేదీలకు థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నట్లుగా పేర్కొంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో ఆరు పేజీల లేఖను రాసింది. ఇందులో పేర్కొన్న అంశాల ప్రకారం చూసినప్పుడు.. గతంలో సినిమాలు రిలీజ్ అయిన సందర్భాల్లోనూ హీరోలు థియేటర్ కు వచ్చారని.. సంధ్య థియేటర్ లో కార్లు.. బైకులకు ప్రత్యేక పార్కింగ్ ఉన్నట్లు పేర్కొంది.

తమ థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయని.. గడిచిన 45 ఏళ్లుగా తాము థియేటర్ ను రన్ చేస్తున్నట్లుగా పేర్కొంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని చెప్పింది. ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ లో 80 మంది స్టాఫ్ విధుల్లో ఉన్నట్లుగా థియేటర్ యాజమాన్యం పేర్కొంది. పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం పంపిన ఆరు పేజీల లేఖలో ఇంకేం విషయాలు ఉన్నాయన్న విషయం వెలుగు చూడాల్సి ఉంది.

Tags:    

Similar News