కిషన్‌రెడ్డికీ తప్పని సోదాలు... మనీ మేటరేనా??
ఇక, దీనికి తోడు.. ఓటర్లకు నగదు పంచేందుకు.. భారీ ఎత్తున కోట్లకు కోట్లను తరలిస్తున్నా రనే వాదన కూడా వినిపిస్తోంది.
ఆయన కేంద్ర మంత్రి, ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి సారథిగా కూడా ఉన్నారు. అయితేనేం.. ఆయనను కూడా పోలీసులు వదిలి పెట్టలేదు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను నిలిపి మరీ.. కారులో ఏముందో ఆసాంతం అన్వేషించారు. అణువణువునూ సోదించారు. ఇదీ.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అక్కడి పోలీసులు తీసుకున్న చర్య. దీనిపై నెటిజన్లు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంకా నామినేషన్ల పర్వం ప్రారంభం కాలేదు. నోటిఫికే షన్ మాత్రమే వచ్చింది. దీంతో రాజకీయంగా పార్టీల మధ్య దూకుడు, అభ్యర్థుల జంపింగులు జోరుగా సాగుతున్నాయి. ఇక, దీనికి తోడు.. ఓటర్లకు నగదు పంచేందుకు.. భారీ ఎత్తున కోట్లకు కోట్లను తరలిస్తున్నా రనే వాదన కూడా వినిపిస్తోంది. ఇటీవల కొన్ని కోట్ల రూపాలయ నగదును పోలీసులు సీజ్ చేశారు.
ఇక, మునుగోడు ఉప ఎన్నికల ఎఫెక్ట్ సహా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నగదు ప్రవాహం నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా ముందుగానే అలెర్ట్ అయింది. తెలంగాణలో అణువణువునూ గాలిస్తోంది. రూ.50 వేలకు మించి ఎవరు నగదుతో కనిపించినా.. పోలీసులు వాలిపోతున్నారు. నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక, రాత్రిపగలు తేడా లేకుండా.. ప్రధాన రహదారులపై నిఘా ముమ్మరం చేసి.. వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా శుక్రవారం ఉదయం చేపట్టిన తనిఖీల్లో ఆదిశగా వస్తున్న కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కారును పోలీసులు ఆపి.. అణువణువూ తనిఖీ చేశారు. భారీ ఎత్తున కర్ణాటక నుంచి నగదును తరలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలోనే ఈ గాలింపు చేపట్టాల్సి వచ్చిందని.. కేంద్ర మంత్రికి పోలీసులు వివరించారు. అయితే.. ఆయన కారులో ఎలాంటి సొమ్ము లేకపోవడంతో పదినిమిషాల తర్వాత.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.