3 గంటల్లో సికింద్రాబాద్ - గుంటూరు.. అదెలానంటే?

సాధారణంగా ఈ దూరానికి రైల్లో జర్నీ కనీసం ఆరేడు గంటలు. సూపర్ ఫాస్ట్ రైళ్లు అయితే ఐదు నుంచి ఆరు గంటలు ఖాయంగా పట్టే పరిస్థితి

Update: 2024-07-05 08:30 GMT

దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న రూట్లలో అత్యంత రద్దీగా ఉండే రూట్లలో ఒకటి సికింద్రాబాద్ - గుంటూరు. సాధారణంగా ఈ దూరానికి రైల్లో జర్నీ కనీసం ఆరేడు గంటలు. సూపర్ ఫాస్ట్ రైళ్లు అయితే ఐదు నుంచి ఆరు గంటలు ఖాయంగా పట్టే పరిస్థితి. వేళ్ల మీద లెక్కేసే రైళ్లు మాత్రం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల్లో చేరుకుంటాయి. అత్యధికం మాత్రం ఆరున్నర గంటల జర్నీ ఖాయం.

అయితే.. ఈ రూట్ లో ప్రయాణ సమయం భారీగా తగ్గే పరిస్థితులు రానున్నాయి. సమీప భవిష్యత్తులో ఈ రూట్ లో ట్రైన్ జర్నీ 3 గంటలకే పూర్తి అవుతుందన్న మాటను చెబుతున్నారు. అదెలానంటే.. ఈ రూట్ లోని నల్లపాడు - బీబీ నగర్ మధ్యన రెండో రైల్వే లైన్ నిర్మాణం మొదలైంది. దీనికి సంబంధించిన మిగిలిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

ఇప్పటికే రైల్వే ట్రాక్ నిర్మాణంతో పాటు.. విద్యుదీకరణ పనులు మొదలయ్యాయి. సుమారు రూ.2853 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నాలుగు దశల్లో పూర్తి చేయాలని డిసైడ్ చేశారు. ఈ పనులు మరో నెలలో మొదలు కానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. ఈ రూట్ లో ట్రైన్ జర్నీ కేవలం మూడు గంటల్లో ముగుస్తుందని చెబుతున్నారు.

ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ తెలుగు మూవీలు దగ్గర దగ్గర మూడు గంటల నిడివి ఉంటున్న సంగతి తెలిసిందే. అంటే.. సినిమా చూసే సమయాన్ని సికింద్రాబాద్ - గుంటూరు మధ్య జర్నీగా చెప్పాలి. ఇది కాస్తా వాస్తవరూపం దాలిస్తే.. ప్రజల జీవనం మరింత వేగవంతం అవుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ రూట్ లో సింగిల్ లైన్ ఉండటంతో రైళ్ల ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటోంది. ఆ కొరతను కొత్త లైన్ తీర్చనుంది.

Tags:    

Similar News

eac