చివరి నిజాంరాజు మనవడు మృతి.. వివరాలు ఇవే!

హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ప్రిన్స్ షాహమత్ ఝా కన్నుమూశారు

Update: 2023-07-31 04:43 GMT

హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ప్రిన్స్ షాహమత్ ఝా కన్నుమూశారు. 70ఏళ్ల షహమత్ ఝా కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొంతుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు.

అవును... గతకొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న షహమత్ ఝూ బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో... ఆయన బాగోగులు చూసుకుంటున్న అతని మేనల్లుడు హిమాయత్ అలీ మీర్జా అతడిని బంజారాహిల్స్‌ లోని ఆసుపత్రికి తరలించగా అక్కడ తుది శ్వాస విడిచాడు.

హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమారుడు మోజం ఝాకు రెండవ భార్య అన్వరీ బేగం కుమారుడు ఈ షహమత్ ఝా. ఈయన ఇద్దరిని వివాహం చేసుకోగా వారి నుంచి విడిపోయిన షహమత్ ఝా గతకొంతకాలంగా ఒంటరిగానే జీవిస్తోన్నారు. అతనికి ఎలాంటి సంతానం లేదు.

ఈ నేపథ్యంలో రెడ్‌ హిల్స్‌ లోని తన ఇంటిని విక్రయించిన తర్వాత బంజారాహిల్స్‌ లోని తన సోదరి ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారు. అతను షాజీ అనే కలం పేరుతో ఉర్దూలో కవిత్వం రాశాడు. ఈయన తండ్రి పేరు మీదుగా మొజాంజాహీ మార్కెట్ అని పేరు పెట్టాడు. షాహామత్‌ జా ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడేవారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కాగా సోమవారం ఉదయం... అతని తాత ఉస్మాన్ అలీ ఖాన్ సమాధి సమీపంలో హైదరాబాద్ కోఠిలోని మస్జిద్-ఎ-జూడిలో అంత్యక్రియ‌లు నిర్వహించనున్నారు నిజాం కుటుంబ సభ్యులు.

Tags:    

Similar News